Telangana – EC : హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య.. కొత్త సీపీలు, ఎస్పీలు, కలెక్టర్ల జాబితా ఇదీ..

Telangana - EC : సీపీలు, ఎస్పీల నియామకానికి సంబంధించిన జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పంపించింది.

Published By: HashtagU Telugu Desk
Election Commission

Election Commission

Telangana – EC : సీపీలు, ఎస్పీల నియామకానికి సంబంధించిన జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పంపించింది. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య, నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్‌, వరంగల్‌ సీపీగా అంబర్‌ కిషోర్‌ ఝా, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్‌, నాగర్‌కర్నూల్ ఎస్పీగా వైభవ్‌ గైక్వాడ్‌ను నియమించారు. మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్థన్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, సూర్యాపేట ఎస్పీగా రాహూల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితీరాజ్ నియమితులయ్యారు. తెలంగాణలో ఇటీవల ఎస్పీలు, సీపీలను బదిలీ చేసిన స్థానాల్లో ఈమేరకు అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

సందీప్ శాండిల్య నేపథ్యం.. 

హైదరాబాద్ సీపీగా నియమితులైన సందీప్ శాండిల్య 1993 బ్యాచ్ ఐపీస్ అధికారి.  గుంటూరులో తొలి పోస్టింగ్ కాగా.. నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగానూ ఆయన సేవలు అందించారు. 2016 నుంచి 2018 వరకు సైబారాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. సీఐడీ, ఇంటెలీజెన్స్ సెక్యూరిటీ వింగ్, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లోనూ విధులు నిర్వర్తించారు. జైళ్లశాఖ డీజీగానూ 3 నెలలు పనిచేశారు. ప్రస్తుతం సందీప్ శాండిల్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్‌ శర్మ, ఎక్సైజ్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ఎన్నికల సంఘం ప్రకటించింది. రంగారెడ్డి కలెక్టర్ గా భారతీ హోలీకేరీ, మేడ్చల్‌ కలెక్టర్‌గా గౌతం, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్‌, నిర్మల్‌ కలెక్టర్‌గా ఆశిష్ సంగవాన్ ను నియమించింది.

Also Read: World Egg Day: గుడ్డు కూడా ఒక రోజు ఉందండోయ్.. గుడ్లతో ఎన్ని లాభాలో తెలుసా..?

  Last Updated: 13 Oct 2023, 05:25 PM IST