Site icon HashtagU Telugu

Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

Ec Denial Of Permission For

EC Denial of permission for Bhadrachalam Sita Ramula Kalyanam live telecast

Bhadradri Sitaram ramula kalyanam: ఈ నెల 17వ తేదీన శ్రీరామ‌న‌వ‌మి(Sri Ramanavami) సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లం(Bhadrachalam)లో నిర్వ‌హించే భ‌ద్రాద్రి సీతారాముల కల్యాణం(Sitaram ramula kalyanam) ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి తాజాగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్(Election Commission) (ఈసీ) అనుమ‌తి నిరాక‌రించింది(Permission denied). దీంతో మంత్రి కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖ రాశారు. క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. తెలంగాణలో కూడా ఎన్నికల నియమావళి కొనసాగుతుండడంతో శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా కొంత ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం కూడా లేదని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు కల్యాణ వేడుకను ప్రత్యక్ష ప్రసారంపై కూడా ఆంక్షలు విధించారు. ‘భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతించ లేదు’ అని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read Also: Jagga Reddy : బంగారం ధర తగ్గాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి