Ebon Urine Cup : ‘ఎబోన్ యూరిన్ కప్’ అనే పేరు కలిగిన యంత్రం తెలంగాణలోని అన్ని పోలీసు స్టేషన్లకు చేరింది. ఇంతకీ అది దేనికి సంబంధించిన యంత్రం అనుకుంటున్నారా ? ఆ యంత్రంతో ఇక గంజాయి వాడే వాళ్లను ఈజీగా ఎక్కడికక్కడే గుర్తుపట్టొచ్చు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) ‘ఎబోన్ యూరిన్ కప్’ పరీక్షల కిట్‌ను రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు అందించింది. ఇప్పటికే పలు స్టేషన్లలో దీనితో తనిఖీలు నిర్వహించడం కూడా మొదలైంది. ఈ కిట్ ద్వారా గంజాయి తాగే వారిని ఎలా గుర్తించాలి అనే దానిపై పోలీసు సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై డ్రగ్స్ మత్తులో ఊగుతూ తిరిగే వాళ్లను పట్టుకునేందుకు ‘డ్రగ్స్ అండ్ డ్రైవ్’ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ‘ఎబోన్ యూరిన్ కప్’ పరీక్షలు చేయనున్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ముఖ్యంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.
Also Read : Akbaruddin Owaisi Key Comments : మా బ్రదర్స్ ను హత్య చేస్తారేమో..?
- గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగించారనే అనుమానం వచ్చిన వారికి ఈ కిట్‌తో మూత్ర పరీక్ష నిర్వహిస్తారు.
- పరికరంలో రెండు ఎర్ర గీతలు కనిపిస్తే నెగెటివ్ గా.. ఒకటే గీత కనిపిస్తే పాజిటివ్ గా నిర్ధారిస్తారు.
- పాజిటివ్ అని తేలే వారిని అదుపులోకి తీసుకొని తదుపరి పరీక్షల కోసం పంపుతారు.
- రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం చాపకింద నీరులా జరుగుతూనే ఉంది.
- ప్రధానంగా యువత, విద్యార్థులే ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు.
- డ్రగ్స్‌ను సేవించే వారిని పట్టుకుంటే వినియోగాన్ని కాస్తయినా గంజాయి దందాను నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.