Site icon HashtagU Telugu

Etela Rajender : హైడ్రా కు ఎలాంటి చట్ట బద్ధత లేదు: ఈటెల కీలక వ్యాఖ్యలు

Eatala Rajender sensational comments on Hydra

Eatala Rajender sensational comments on Hydra

Etela Rajender Sensational Comments On HYDRA : మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రా పై కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో తాజాగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా కు ఎలాంటి చట్ట బద్ధత లేదని అన్నారు. హైడ్రా ఏర్పాటు పై ఏ క్యాబినెట్ మంత్రితో చర్చించినట్టు ఎక్కడ కనపడలేదు. హైడ్రాకు గొప్ప బాధ్యత ఉంటే.. శాసనసభలో చర్చించి చట్టబద్ధత కల్పించి ఏర్పాటు చేసి ఉండాల్సింది.

నీ అబ్బ జాగీర్ కాదు రేవంత్ రెడ్డి..

హైడ్రా ను రేవంత్ రెడ్డి తన సొంత ఎజండగా తీసుకొచ్చినట్టు ఉంది. అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరుకోలేదు. గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రులు,అనేక తప్పు చేసినట్టుగా,తాను మాత్రం అన్ని సరిదిద్దుతున్నట్టు ఫోజు రేవంత్ రెడ్డి కొడుతున్నారు. ఏవైతే అక్రమ నిర్మాణాలు అంటున్నావో, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల తప్పులను ముందుగా ఒప్పుకోని చెంపలేసుకుని సరిదిద్దాలి. అన్ని అనుమతులతో నిర్మాణం చేపట్టి,30 ఏళ్లుగా టాక్స్ కడుతున్న వాటిని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ముఖ్యమంత్రి కూల్చడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు పట్టాలిచ్చి వాటిలో ప్రభుత్వా అనుమతులతో నిర్మించుకున్న వాటికి నోటీసులు ఇచ్చి కూల్చే ప్రయత్నం చేయాలని చూడటం నీ అబ్బ జాగీర్ కాదు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.

Read Also: Lemon Lamp: నిమ్మకాయతో దీపం పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!