Site icon HashtagU Telugu

Eatala & DK Aruna: గృహనిర్బంధంలో ఈటల రాజేందర్, డీకే అరుణ!

Dk N Eetala

Dk N Eetala

Eatala & DK Aruna: బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌, హుజూరాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. రాజేందర్‌తోపాటు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణను కూడా అధికారులు ఆమె నివాసానికే పరిమితం చేశారు.

బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్లను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు పరిశీలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు నివేదిక ప్రకారం.. ముందస్తుగా నేతలను బంధించారు. ఈ పర్యటనను అడ్డుకోవడానికి జంట నగరాల్లో పలువురు బిజెపి నాయకులను గృహనిర్బంధంలో ఉంచినట్టు సమాచారం. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడూం ఇళ్లను కేటాయించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది.

Also Read: Hyderabad : హైద‌రాబాద్‌లో దంచికొడుతున్న వాన‌.. నీట‌మునిగిన ప‌లు ప్రాంతాలు