Eatala: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?

కేసీఆర్ ని జైలుకు పంపిస్తాం, కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని డైలాగులు చెప్పిన బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు.

కేసీఆర్ ని జైలుకు పంపిస్తాం, కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని డైలాగులు చెప్పిన బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు.
రాష్ట్రంలో వరి రైతుల సమస్యపై ఒకపక్క కాంగ్రెస్ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఇక టీఆర్ఎస్ కూడా ee పరిస్థితికి కారణం బీజేపీ అని విమర్శలు చేస్తోన్నా బీజేపీ ప్రోగ్రామ్ ఏం లేదనే చెప్పొచ్చు.

రాష్ట్ర బీజేపీ ఆగ్రనాయకత్వం కొంత చల్లబడ్డా తాజా బీజేపీ నాయకుడు ఈటల మాత్రం వేగం పెంచినట్లు కన్పిస్తోంది. ఈ వేదిక దొరికినా కేసీఆర్ పై నిప్పులు రాజేస్తున్నాడు.

వరి కొనుగోలు పై ఆందోళనలు చేస్తాం అని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు aa విషయంలో సైలెంట్ గా ఉన్నా. ఈటల మాత్రం రైతుల కష్టాలకు కారణం కేసీఆర్ అని ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నాడు.

ఈటల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడంతో, ఆయన స్పీడ్ ని అందుకోలేక రాష్ట్ర బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ అధ్యక్షుడిగా అయ్యాక బీజేపీలో కొంత జోష్ వచ్చిందనడంలో సందేహమేమీ లేదు. అయితే తాజాగా ఈటల స్పీడ్ చూస్తున్న కార్యకర్తలు నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.

అయితే ఇలాంటి గాసిప్స్ ని కావాలనే ఈటల వర్గం ప్రచారం చేయిస్తోందనే టాక్ కూడా పార్టీలో నడుస్తోందట. అయితే ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయితేనే బీజేపీ బలపడడంతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని బలమైన నాయకులు బీజేపీలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. మరి ఢిల్లీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడానికి సమయం పట్టుద్ది.