Site icon HashtagU Telugu

Dussehra Holidays : దసరా హాలిడేస్ సందడి.. రైళ్లు, బస్సులు కిటకిట

Dussehra Holidays

Dussehra Holidays

Dussehra Holidays : తెలంగాణలో ఈరోజు నుంచి  దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అక్టోబర్ 25 వరకూ స్కూళ్లకు దసరా సెలవులు ఉన్నాయి. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులను అనౌన్స్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో రేపటి (అక్టోబర్ 14)  నుంచి ఈనెల 24 వరకు దసరా సెలవులను ప్రకటించారు. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు స్కూళ్లకు 13 రోజుల లీవ్స్ ఇచ్చింది. ఈనేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ దసరా సందడి మొదలైంది. పిల్లలంతా సెలవుల మూడ్ లోకి మారిపోయారు. శుక్రవారం ఉదయం నుంచే బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు పెద్ద సంఖ్యలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ, గుంటూరు సహా అన్ని ప్రధాన నగరాల్లో వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరిగాయి.  ఇక ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమతమ లగేజీలతో సొంతూళ్లకు బయలుదేరారు. దసరా పండుగ రద్దీ కారణంగా రైళ్లు, బస్సులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ట్రైన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. రాకపోకల కోసం ముందస్తుగానే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ సిటీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.  ఈ పండుగ వేళ  తెలంగాణ ప్రజలకు పెద్ద ఊరట ఏమిటంటే..  దసరా, బతుకమ్మ పండుగల కోసం నడిపే ప్రత్యేక బస్సుల టికెట్ల రేట్లను ఆర్టీసీ పెంచలేదు. అక్టోబరు 25 వరకు ఆర్టీసీ ఐదువేలకు పైగా స్పెషల్‌ సర్వీసులను (Dussehra Holidays) నడపనుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. దానికి అనుగుణంగా బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోబోతున్నారు.

Also Read: I Am With CBN : నేడు బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్ల‌నున్న ఐటీ ఉద్యోగులు