Congress Crisis: రేవంత్ రెడ్డి రాజీనామాకు `డీఎస్ టీ` సోష‌ల్ వార్

మీడియాలో డెమొక్రాటిక్ అండ్ సోష‌ల్ తెలంగాణ(డీఎస్ టీ) పేరుతో ఒక మెసేజ్ వైర‌ల్ అవుతోంది. హుజురాబాద్ ఉప ఫ‌లితాల్లో కాంగ్రెస్ కు వ‌చ్చిన నామ‌మాత్ర‌పు ఓట్ల‌కు నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని ఆ మెసేజ్ డిమాండ్.

  • Written By:
  • Updated On - November 4, 2021 / 12:29 PM IST

మీడియాలో డెమొక్రాటిక్ అండ్ సోష‌ల్ తెలంగాణ(డీఎస్ టీ) పేరుతో ఒక మెసేజ్ వైర‌ల్ అవుతోంది. హుజురాబాద్ ఉప ఫ‌లితాల్లో కాంగ్రెస్ కు వ‌చ్చిన నామ‌మాత్ర‌పు ఓట్ల‌కు నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని ఆ మెసేజ్ డిమాండ్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్ర‌చార క‌మిటీ క‌న్వీన‌ర్ మ‌ధుయాష్కీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్ రాజీనామా చేయాల‌ని డీఎస్ టీ కోరుతోంది. ఆ మేర‌కు ఏఐసీసీకి, రాహుల్ గాంధీకి టాగ్ చేస్తూ మెసేజ్ ను వైర‌ల్ చేస్తోంది.
డీఎస్ టీ పేరుతో ఏర్ప‌డిన గ్రూప్ లో అనేక మంది ఎన్నారైలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి సూచ‌న‌లు , స‌ల‌హాలు అనేక సంద‌ర్బాల్లో ఇచ్చిన విష‌యాన్ని వాళ్లు ఆ మెసేజ్ లో గుర్తు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియ‌మించ‌డాన్ని తొలి రోజుల్లోనే ఈ గ్రూప్ స‌భ్యులు వ్య‌తిరేకించారు. స‌భ‌ల‌కు ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌ట్ట‌డం, ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన టీంల‌తో రేవంత్ జై కొట్టించుకుంటాడ‌ని ఆరోపిస్తున్నారు. చ‌ప్ప‌ట్లు, జేజేలు ప‌లికించుకోవ‌డం మిన‌హా క్షేత్ర‌స్థాయిలో రేవంత్ కు బ‌లంలేని విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

Also Read : సీనియ‌ర్ల ప‌ద్మ వ్యూహంలో రేవంత్ రెడ్డి 

ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా ఉన్న మ‌ధు యాష్కీ గౌడ్ సొంత కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటాడ‌ని డీఎస్ టీ భావ‌న‌. ఆయ‌న‌కు ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే స‌త్తా లేద‌ని పేర్కొంటోంది. నిజామాబాద్ లో ఓడిపోయిన మ‌ధుయాష్కీ ఓట‌ర్ల‌ను బూత్ వ‌ర‌కు తీసుకొచ్చే స‌ర‌కు ఆయ‌న వ‌ద్ద‌లేద‌ని చెబుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మికి కార‌కులుగా భావించి ఆయ‌న చేత రాజీనామా చేయించాల‌ని కోరుతోంది.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం ప్రియాంక గాంధీ అనేక స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన రైతుల కోసం ఆమె చేసిన పోరాటం మ‌రువ‌లేనిది. అక్క‌డ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు న‌డిపిస్తున్నారో..చూడాల‌ని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న ఠాకూర్ కు డీఎస్ టీ సూచిస్తోంది. ఇక‌నైనా కాంగ్రెస్ భావ‌జాలం ఉన్న పీసీసీ అధ్య‌క్షుడ్ని నియ‌మించాల‌ని డిమాండ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న స‌ర్క‌స్ టీం ను డిస్మిస్ చేయాలని కోరుతూ ఏఐసీసీకి డీఎస్ టీ సోష‌ల్ మీడియా వేదిక‌గా మెసేజ్ ను వైర‌ల్ చేస్తోంది.

Also Read : ఈటలని గెలిపించిన పది సూత్రాలు ఇవే