DSC Notification: 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ లో పరీక్ష..!

తెలంగాణ 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదలైంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

  • Written By:
  • Updated On - September 8, 2023 / 06:58 AM IST

DSC Notification: తెలంగాణ 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదలైంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు CBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పాఠశాల విద్యాశాఖలో 5, 089 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు 611 భాషా పండితులు, 164 పీఈటీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

మరోవైపు ఈనెల 15న తెలంగాణ టెట్ పరీక్ష కూడా ఉంది. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-1 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Also Read: Bharat Jodo Yatra: శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం

జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు ఇలా ఉన్నాయి

ఆదిలాబాద్ – 275

ఆసిఫాబాద్ -289

భద్రాద్రి కొత్తగూడెం- 185

హనుమకొండ -54

హైదరాబాద్ -358

జగిత్యాల-14

జనగాం- 76

జయశంకర్ భూపాలపల్లి- 74

జోగులాంబ- 146

కామారెడ్డి – 200

కరీంనగర్ – 99

ఖమ్మం – 195

మహబూబాబాద్ – 125

మహబూబ్ నగర్- 96

మంచిర్యాల – 113

మెదక్ – 147

మేడ్చల్- 78

ములుగు – 65

నాగర్ కర్నూల్ – 114

నల్గొండ – 219

నారాయణపేట – 154

నిర్మల్ – 115

నిజామాబాద్ – 309

పెద్దపల్లి – 43

రాజన్న సిరిసిల్ల – 103

రంగారెడ్డి – 196

సంగారెడ్డి – 283

సిద్దిపేట -141

సూర్యాపేట – 185

వికారాబాద్ -191

వనపర్తి – 76

వరంగల్ – 99

యాదాద్రి- 99

ఇందులో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358 నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.