Site icon HashtagU Telugu

DSC Candidates: కేసీఆర్ కు షాక్.. కామారెడ్డిలో బరిలో ‘ఢీ’ఎస్సీ అభ్యర్థులు

BRS plan

CM KCR fires on Congress at Nirmal District Meeting

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ అధినేత సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో రెండో చోట్లా పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఒకటి గజ్వేల్ కాగా, మరొకటి కామారెడ్డి. అయితే ఇప్పట్నుంచే గులాబీ బాస్ ను మెజార్టీతో గెలిపించుకోవాలని పార్టీ నాయకులు రంగంలో దిగితే.. వారికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు డీఎస్సీ అభ్యర్థులు. ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు నొటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం విధతమే. ఈ మేరకు విద్యాశాఖ ఎదుట ధర్నాకు కూడా దిగారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభ్యర్థులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

గత ఎన్నికల్లో నిజామాబాద్ లో పసుపు రైతులు ప్రస్తుత ఎమ్మెల్సీ కవితను ఓడించిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు కోసం ఎలాంటి హామీ ఇవ్వకపోడంతో అక్కడి రైతులు లెక్కకు మించి నామినేషన్లు వేసి కవితను ఓడించారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ ను ఓడించాలని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు వ్యూహరచన చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి లో దాదాపు వెయ్యి నామినేషన్లు వేసి కేసీఆర్ ను ఓడిస్తామని వారు నిన్న జరిగిన ధర్నాలో తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్‌సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. డీఎస్ సీ ద్వారా 2,575 ఎస్‌జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్‌సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాల పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో వరాలు కురిపించిన కేసీఆర్ డీఎస్సీ అభ్యర్థులకు మెగా ఆఫర్ ను ప్రకటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Pawan Kalyan: పవన్ పై ఎన్నికల ఎఫెక్ట్, ఆ సినిమాల షూటింగ్స్ రద్దు చేసుకోవాల్సిందేనా!

Exit mobile version