Site icon HashtagU Telugu

New Year 2024: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే రూ.15,000 ఫైన్

Drunk Drivers

Drunk Drivers

New Year 2024: నూతన సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15000 వరకు జరిమానా విధించాలని నగర పోలీసులు నిర్ణయించారు.మొదటిసారి పట్టుబడిన వారిపై రూ.10,000 మరియు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంది. రెండవసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వారికి రూ.15,000 మరియు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఈ మేరకు డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు.

న్యూ ఇయర్‌కు మూడు రోజులు మాత్రమే ఉన్నందున సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరియు హైదరాబాద్ పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే రూ15,000 వరకు కఠినమైన జరిమానా విధించనున్నారు. ఆ రాత్రి నగరంలో పదికి పైగా ఫ్లైఓవర్‌లను మూసివేస్తారని పోలీసులు చెప్పారు.జరిమాన మరియు జైలు శిక్షతో పాటు నేరం ఫ్రీక్వెన్సీని బట్టి నేరస్థుల డ్రైవింగ్ లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.

కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పది ప్రధాన ఫ్లై ఓవర్లు, కొన్ని రహదారులను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. మూసివేయవలసిన ఫ్లై ఓవర్లు ఇవే:

శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్
గచ్చిబౌలి ఫ్లై ఓవర్
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌లు
షేక్‌పేట ఫ్లైఓవర్
మైండ్ స్పేస్ ఫ్లైఓవర్
రోడ్ నెం.45 ఫ్లై ఓవర్
దుర్గం చెరువు కేబుల్ వంతెన
సైబర్ టవర్ ఫ్లైఓవర్
ఫోరమ్ మాల్ ఫ్లైఓవర్
ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్
బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్) కాకుండా ఔటర్ రింగ్ రోడ్ (ORR) మరియు PVNR ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ముందుజాగ్రత్త చర్యగా మూసివేయబడతాయి.

ప్రత్యేక కెమెరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాయి, వీటిలో ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లు, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ మరియు హెల్మెట్‌లెస్ రైడింగ్ లకు పాల్పడితే మూల్యం చెల్లించక తప్పదు. సరైన డాక్యుమెంటేషన్ లేని వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేయడంతోపాటు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు.అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ర్యాష్ డ్రైవింగ్ మరియు ఇలాంటి ఇతర నేరాలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read: Health Benefits: నిత్యం పెరుగులో ఇది కలిపి తీసుకుంటే చాలు.. కలిగే లాభాలు ఎన్నో?