Drugs : తెలంగాణ‌లో డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ స‌హా ఐదుగురు అరెస్ట్‌.. 18గ్రామ‌లు MDMA స్వాధీనం

తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో (TS-NAB) గోవాకు చెందిన డ్రగ్ పెడ్లర్‌తో సహా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. డ్ర‌గ్స్

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 10:36 PM IST

తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో (TS-NAB) గోవాకు చెందిన డ్రగ్ పెడ్లర్‌తో సహా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుడు అఖిల్‌గా గుర్తించారు. MDMA విక్రయించడం, వినియోగిస్తున్నందుకు మరో నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోవాలోని అంజునా బీచ్‌లోని గెస్ట్‌హౌస్‌లో పనిచేస్తున్న అఖిల్ హోటల్‌కు వచ్చేవారికి డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఈ విధంగా ఇతర నిందితులు వారి ఉపయోగం కోసం మొదట అతని నుండి డ్రగ్స్ కొనుగోలు చేశారు. క్రమంగా వారు పెద్ద మొత్తంలో సేకరించడం..దానిని అధిక ధరలకు సరఫరా చేయడం ప్రారంభించారు. ఇతర నిందితుల్లో ఇంజినీరింగ్ విద్యార్థి సూర్య కిస్సన్ (21), కాలేజీ డ్రాపవుట్ అయిన రోహన్ పాల్ (19) ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న బేలె అరుణ్ కుమార్ (23), తోట సురేందర్ (23) ఉన్నారు. వీరు హైదరాబాద్‌లోని హబ్సిగూడ వాసులుగా గుర్తించారు. కిస్సాన్, రోహ‌న్‌ పాల్ తరచూ గోవాకు వెళ్లే సమయంలో అఖిల్‌తో స్నేహం ఏర్పడిందని.. వారి కోసం అతని నుండి డ్రగ్స్ సేకరించడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. క్రమంగా వారు హైదరాబాద్‌లోని వినియోగదారులకు విక్రయించడానికి పెద్దమొత్తంలో సేకరించడం ప్రారంభించార‌ని తెలిపారు. ఈ క్రమంలో అరుణ్‌, సురేందర్‌లు వారితో స్నేహం చేసి వినియోగదారులుగా ప్రారంభించి క్రమంగా చిరువ్యాపారులుగా మారార‌ని నార్కొటిక్ బ్యూరో అధికారులు తెలిపారు.

Also Read:  Balakrishna : ఓట్ల కోసమే బిఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు – బాలకృష్ణ