Nigerian Gangs : సీఎం రేవంత్ సర్కారు హైదరాబాద్‌లోని డ్రగ్స్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో నగరంలో డ్రగ్స్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు నైజీరియన్లకు చెక్ పెడుతోంది. వీసా గడువు ముగిసినా.. చాలా ఏళ్లుగా సిటీలోనే అక్రమంగా ఉంటున్న నైజీరియన్లను గుర్తించడంపై ప్రస్తుతం పోలీసు విభాగం ఫోకస్ పెట్టింది. తరుచుగా అడ్రస్‌లు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్న వారి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక టీమ్‌లను హైదరాబాద్ పోలీసు విభాగం రంగంలోకి దింపింది. అలాంటి వారిలో పలువురి ఆచూకీని ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం.
Also Read :Car Attack : జర్మనీ క్రిస్మస్ మార్కెట్‌లో జనంపైకి కారు.. ఇద్దరి మృతి, 68 మందికి గాయాలు
హైదరాబాద్‌లోని కాలేజీల్లో అడ్మిషన్ల కోసం, కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఏటా ఎంతోమంది ఆఫ్రికా దేశాల నుంచి వస్తుంటారు. అయితే అలాంటి వారిలో కొందరు డబ్బుపై అత్యాశతో డ్రగ్స్ ముఠాల్లో చేరిపోతుంటారు. లగ్జరీ లైఫ్‌ను గడిపేందుకు డ్రగ్స్ సప్లై ఛైన్‌లో భాగంగా మారుతున్నారు. ఒక్కసారి ఈ ఛైన్‌లో చేరిన తర్వాత బయటపడటం వారికి చాలా కష్టతరంగా మారుతోంది. విదేశాల నుంచి మన దేశంలోని ముంబై, అహ్మదాబాద్, చెన్నై ఓడరేవులకు చేరే మాదక ద్రవ్యాలను సేకరించేందుకు ఆఫ్రికా దేశాల వారిని డ్రగ్స్ ముఠాలు వాడుకుంటున్నాయి. ఓడరేవుల నుంచి హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకు మాదక ద్రవ్యాలను సేఫ్‌గా చేరిస్తే ఎంతోకొంత ముట్టజెప్పుతున్నాయి. అంతేకాదు హైదరాబాద్ సిటీ పరిధిలో కొందరు యువత, డ్రగ్స్ అలవాట్లు కలిగిన వారికి డ్రగ్స్‌ను సప్లై చేయడంలోనూ ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చిన వారినే డ్రగ్స్ ముఠాలు వాడుకుంటున్నాయి.
Also Read :Hindu Heritage Month : ఇకపై ఒహాయోలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు
ఈ తరహా డ్రగ్స్ నెట్‌వర్క్‌లలో(Nigerian Gangs) భాగంగా ఉన్న ఆఫ్రికన్ల ఏరివేతలో హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. టీజీన్యాబ్, హెచ్‌న్యూ, నగర పోలీసు యంత్రాంగం కలిసికట్టుగా ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ టీమ్‌ల రైడ్స్‌కు భయపడి.. ఇప్పటికే చాలామంది ముంబై, బెంగళూరు, గోవా, చెన్నై, ఢిల్లీలకు పారిపోయినట్లు తెలుస్తోంది. వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో ఉంటున్న ఆఫ్రికన్లను గుర్తించి వాళ్ల దేశాలకు తిరిగి పంపించేస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న 103 మంది ఆఫ్రికన్లను గత ఏడేళ్లలో సిటీ నుంచి వాళ్ల దేశాలకు పంపించేశారు.