హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. గత కొద్దీ రోజులుగా తెలంగాణ పోలీసులు డ్రగ్స్ విషయంలో చాల కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయం చేస్తున్నారని..హైదరాబాద్ ను డ్రగ్స్ కు అడ్డగా మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో పోలీసులకు కఠిన ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్స్ విషయంలో ఎక్కడ తగ్గొద్దని..ఎంత పెద్ద వారైనా సరే వదిలిపెట్టొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం తో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఆదివారం రాయదుర్గం (Rayadurgam)లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను ఎస్‌ఓటీ అధికారులు పట్టుకున్నారు. 32 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. రాజమండ్రికి చెందిన విక్కీ, గోపి షెట్టి, రాజేష్, నరేష్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి కొకైన్ తెచ్చి హైదరాబాద్‌లో వీరు విక్రయిస్తుండగా..పక్క సమాచారం అందుకున్న అధికారులు వీరిని పట్టుకున్నారు. సంపన్నులను టార్గెట్ చేసి వీరు కొంతకంగా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. విక్కీని పట్టుకోవడానికి గత సంవత్సరం నుంచి ఎస్ఓటీ వల వేసింది. స్పెషల్ ఆపరేషన్ టీమ్ కళ్లు కప్పి విక్కీ గత కొంతకాలంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. ఎట్టకేలకు విక్కీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసారు.
Read Also : Chandrababu Case : చంద్రబాబు బెయిల్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు