Site icon HashtagU Telugu

Raj Pakala : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల‌ ఫాం‌హౌస్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్స్

Raj Pakala House

Raj Pakala House

Raj Pakala : బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల అలియాస్ రాజ్ పాకాల‌(Raj Pakala)కు చెందిన ఫాం‌హౌస్‌పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్ ఎస్‌ఓటీ, నార్సింగి పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఈ ఫాంహౌస్ ఉంది. ఇందులో భారీ డీజే సౌండ్స్‌తో రేవ్ పార్టీ జరుగుతోందని, డ్రగ్స్ వాడుతున్నారని కొందరు వ్యక్తులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.  దీంతో పోలీసుల ప్రత్యేక టీమ్స్ వచ్చి రాజ్ పాకాల‌కు చెందిన ఫాం‌హౌస్‌‌లో తనిఖీలు చేశాయి.

Also Read :Air India Express : విశాఖ టు విజయవాడ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ప్రారంభం

ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు అధికారులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో విజయ్ మద్దూరి అనే వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు వ్యక్తిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీలో వాడిన ఫారిన్ లిక్కర్‌ను పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఫారిన్ లిక్కర్ వాడినందుకు ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 కింద మరో కేసును నమోదు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న 21 మంది పురుషులు, 14 మంది యువతులు, మహిళలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. జన్వాడ ఫాం హౌస్‌లో లిక్కర్‌ను వినియోగించేందుకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికారులు తెలిపారు.

Also Read :Medaram Jathara : మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇందులో భాగంగా యాంటీ నార్కోటిక్స్‌కు సంబంధించి ఓ విభాగం ఏర్పాటు చేసి, దానికి ప్రత్యేక సారథిని నియమించారు. సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు ఈ విభాగం ఉన్నతాధికారులతో సమావేశమై అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని సీఎం రేవంత్ తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడే విషయంలో రాజీపడబోమని ఆయన అంటున్నారు.