Defence Leak: పాక్ గూఢచారికి క్షిపణి ప్రయోగ సమాచారమిచ్చిన డీఆర్డీఎల్ ఇంజినీర్ అరెస్టు

దేశ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన రహస్యాలను ఓ పాక్ గూఢచారికి అందిస్తున్న హైదరాబాద్ లోని డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఇంజినీర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 02:24 PM IST

దేశ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన రహస్యాలను ఓ పాక్ గూఢచారికి అందిస్తున్న హైదరాబాద్ లోని డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఇంజినీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డీఆర్డీఎల్ అంటే.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ. ఇది డీఆర్డీఓ పరిధిలో పనిచేస్తుంది.

అడ్వాన్స్ నావల్ సిస్టం ప్రోగ్రాం విభాగంలో క్వాలిటీ అష్యురెన్స్ ఇంజినీర్ హోదాలో కాంట్రాక్టు ప్రాతిపదికన నిందితుడు పనిచేస్తున్నట్లు గుర్తించారు. నటాషా రావు పేరుతో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన పాక్ గూఢచారితో 2020 మార్చి నుంచి 2021 డిసెంబరు దాకా డీఆర్డీఎల్ ఇంజినీర్ టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. “గతంలో మా నాన్న ఇండియా ఎయిర్ ఫోర్స్ లో పని చేశారు. అప్పుడు మేం బెంగళూరులో ఉండేవాళ్ళం. ఇప్పుడు మేం బ్రిటన్ కు షిఫ్ట్ అయ్యాం.

నేను బ్రిటన్ లోని ఒక డిఫెన్స్ జర్నల్ లో పని చేస్తున్నాను” అని సదరు పాక్ గూఢచారితో మాటలు కలిపినట్లు గుర్తించారు. ఇవన్నీ నిజమే అనుకున్న డీఆర్డీఎల్ ఇంజినీర్.. ఆమె అడిగిన సమాచారం తో మూడిపడిన ఫోటోలను, ఆధారాలను ఎప్పటికప్పుడు పంపించాడు. దర్యాప్తులో ఈవిషయం తేలడంతో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, స్థానిక (బాలాపూర్) పోలీసులు కలిసి మీర్ పెట్ లోని అతడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్409, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ లోని పలు నిబంధనల కింద ఇంజనీర్ పై కేసు నమోదు చేశారు.