Site icon HashtagU Telugu

Green India Challenge: మన జీవన ప్రయాణంలో ప్రతీ అంశంలో కాలుష్యం కల్లోల్లం చేస్తోంది: డాక్టర్ సతీశ్ రెడ్డి

Green India

Green India

ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త, తన విజనరీ ఆలోచనలతో దేశానికి రక్షణ, అంతరిక్ష రంగంలో చారిత్రక విజయాలను అందించిన మేధావి. భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి. సతీశ్ రెడ్డి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా సికింద్రాబాద్ లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల్లో రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఈ ప్రపంచంలో అన్నింటికంటే ప్రమాదకరమైనది కాలుష్యం మనిషి తన అవసరాల కోసం సృష్టించిన ప్లాస్టిక్, తయారు చేసిన వాహనాలు ఇవ్వాల యావత్ భూమండలాన్ని కల్లోలం చేస్తున్నాయి. దీని నుంచి మనిషి బయటపడటానికి లక్షల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అంతేకాదు.. కాలుష్యం సృష్టించిన విలయం వల్ల ప్రతి రెండు ఇళ్లలో ఒకరు హాస్పిటలో చేరాల్సిన పరిస్థితి దాపురించింది. కాలుష్యం అనేది ఒక్క గాలికి, నీరుకు సంబంధించిందో కాదు.. మన జీవిత ప్రయాణంలో ప్రతీ అంశంలో కాలుష్యం కల్లోలితం చేస్తుంది. అందుకే ఇవ్వాల లక్షల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ వేరే గ్రహాల్లో జీవ అవకాశాలు కోసం పరిశోధిస్తున్నాం. ఈ సమస్యలన్నింటికి ఏకైక పరిష్కారం మొక్కలు నాటడం. ఆ పని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. సంతోష్ కుమార్ చేస్తున్న కృషిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములం కావల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది’’ ఆయన అన్నారు.

రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ శాస్త్ర సాంకేతికరంగంలో భారత దేశం గర్వించే స్థానానికి చేరుకోవడంలో తనదైన పాత్ర పోషించిన సతీష్ రెడ్డిగారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. వారి స్పూర్తివంతమైన మాటలు.. అనేక మందిని మొక్కలు నాటించేవైపుగా ఆలోచింప చేసేవిగా ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబెర్స్ రాఘవ, కర్ణాకర్ రెడ్డి, ఇతర సైంటిస్టులు పాల్గొన్నారు.

Exit mobile version