Hyderabad: నగరంలో భారీ అగ్ని ప్రమాదం: యువకుడిపై అనుమానాలు

హైదరాబాద్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad: హైదరాబాద్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిసి కెమెరాలను బట్టి చూస్తే ఓ యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి క్రాకర్స్ షాపు వద్దకు ఓ యువకుడు వచ్చి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. అయితే ఈ ప్రమాదంతో సదరు యువకుడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంతో ఆ యువకుడికి ఎలాంటి సంబంధం లేకుంటే, ఘటనాస్థలికి ఎందుకు వెళ్లాడు అతను అక్కడ ఏమి చేస్తున్నాడు ఇలా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. కాగా ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అగ్ని ప్రమాదంలో ఏమైనా కుట్ర కోణం ఉందా? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంఘటన వివరాలు చూస్తే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలోని క్రాకర్స్ షాపులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో సమీపంలోని ఫుడ్ కోర్ట్‌కు కూడా వ్యాపించాయి. దీంతో ఫుడ్ కోర్టులోని సిలిండర్ పేలింది. పెద్ద శబ్ధంతో రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురయ్యారు. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో ఆందోళన చెందారు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మొదటి షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగాయని భావించారు. కానీ సిసి కెమెరా పరిశీలించిన అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇదిలా ఉండగా అనుమతులు లేకుండానే పటాకుల దుకాణం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Also Read: చంద్రమోహన్ పోగొట్టుకున్న వందల కోట్ల ఆస్తులు