Dornakal : డోర్నకల్ లో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం…

అధికార పార్టీ బిఆర్ఎస్ ప్రచారం లో దూకుడు కనపరుస్తుంది. అధినేత కేసీఆర్ ఓ పక్క ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జిలాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ

Published By: HashtagU Telugu Desk
dornakal brs candidate redya naik

dornakal brs candidate redya naik

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం (Election Campaign) హోరెత్తిస్తుంది. ఊరు , వాడ , పల్లె , పట్టణం అనే తేడాలేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ప్రచారం లో దూకుడు కనపరుస్తుంది. అధినేత కేసీఆర్ (KCR) ఓ పక్క ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జిలాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ..పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో జరిగిన అభివృద్ధి , తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూనే..కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) పాలిత ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి ఉందొ..కరెంట్ కష్టాలు ఎలా ఉన్నాయి..రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుపుతూ..అలాంటి పరిస్థితి తెలంగాణ కు మళ్లీ రాకుండా ఉండాలంటే ఆ పార్టీలకు ఓటు వెయ్యొద్దని కోరుకుంటూ ఆకట్టుకుంటున్నారు.

ఇటు నియోజక వర్గాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తూ మరోసారి బిఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇక డోర్నకల్ నియోజక వర్గం (Dornakal Constituency) లో బిఆర్ఎస్ జోరు రోజు రోజుకు మరింత ఊపందుకుంటుంది. డోర్నకల్ బిఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ (Dornakal BRS Candidate Redya Naik) ను మరోసారి గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రతి గడపకు వెళ్లి పార్టీ లీడర్స్ , కార్యకర్తలు బిఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు , ఆసరా పెన్షన్ల , బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ..మరోసారి బిఆర్ఎస్ కు ఓటు వేసి రెడ్యాను గెలిపించాలని, కేసీఆర్ ను సీఎం చేయాలనీ కోరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రెడ్యానాయక్ (Redya Naik) రాజకీయ విషయానికి వస్తే..

ఉగ్గంపల్లి సర్పంచ్ గా ఎన్నికైన రెడ్యానాయక్..ఆ తర్వాత అధ్యక్షుడు, పంచాయితీ సమితి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా ఇలా అత్యున్నత పదవులు దక్కించుకుంటూ ప్రజలకు దగ్గరయ్యారు. ఎమ్మెల్యే గా , మంత్రి గా ప్రజలకు సేవ చేస్తూ..వస్తున్న రెడ్యా.. డోర్నకల్ నియోజకవర్గంలో అత్యధిక సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఈయన కూతురు మాలోత్ కవిత (Kavitha Maloth) సైతం ఎంపీ గా ప్రజలకు సేవ చేస్తున్నారు.

Read Also : Teenmar Mallanna : కాంగ్రెస్ గూటికి తీన్మార్ మల్లన్న

  Last Updated: 08 Nov 2023, 10:37 AM IST