Site icon HashtagU Telugu

Talasani Srinivas Yadav: చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దు

Thlasani

Thlasani

హైదరాబాద్: సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) మంగళవారం ట్రాఫిక్‌ నిబంధనల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు. మోండా మార్కెట్‌ డివిజన్‌ పరిధిలోని మోండా మార్కెట్‌, ఓల్డ్‌ గాంధీ హాస్పిటల్‌, ఓల్డ్‌ జైల్‌ఖానా ప్రాంతాలకు చెందిన పలువురు చిరువ్యాపారులు  వెస్ట్‌మారేడుపల్లిలోని (West Maredpally) ఆయన నివాసానికి విచ్చేసి తమ సమస్యలను విన్నవించారు.

ఆయనకు అందిన సమాచారం ప్రకారం వీరంతా అనేక సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారని, కానీ ట్రాఫిక్‌ పోలీసుల వారి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనల (Traffic Rules) కారణంగా తమకు ఇబ్బందులు వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు వారు ఎమ్మెల్యే సహాయం కోరారు.

ఈ మేరకు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) మోండా మార్కెట్‌ ట్రాఫిక్‌ సీఐకి (Traffic) ఫోన్‌ చేసి, హాకర్స్‌ను (Hackers) ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని హాకర్స్‌ విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో హాకర్స్‌ అసోసియేషన్‌ నగర అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి మేకల అశోక్‌, శివ, గోవర్ధన్‌, రాజు, అల్తాఫ్‌, బబ్లు తదితరులు పాల్గొన్నారు.