CM Revanth : సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం..నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దు

తెలంగాణ రెండో ముఖ్యమంత్రి (Revanth Reddy) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తన మార్క్ కనపరుస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ..వారికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం..తాజాగా తన కాన్వాయ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. తన కాన్వాయ్ (CM Revanth Convoy) కోసం ట్రాఫిక్ (Traffic) ను అపోదంటూ సీఎం (Revanth Reddy) […]

Published By: HashtagU Telugu Desk
Don't Stop Traffic For My C

Don't Stop Traffic For My C

తెలంగాణ రెండో ముఖ్యమంత్రి (Revanth Reddy) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తన మార్క్ కనపరుస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ..వారికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం..తాజాగా తన కాన్వాయ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తన కాన్వాయ్ (CM Revanth Convoy) కోసం ట్రాఫిక్ (Traffic) ను అపోదంటూ సీఎం (Revanth Reddy) తెలిపినట్లు సీపీ తెలిపారు. సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సిఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం రేవంత్ కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అలాగే కాన్వాయ్ కోసం కొత్త కార్లను కొనొద్దని , ప్రస్తుతం ఉన్న తెల్ల రంగు కార్లకు నలుపు రంగు వేసి వినియోగించాలని తెలిపినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

అలాగే తనకు అధికారిక నివాసం లేనందున..మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఓ ఎకరం స్థలంలో షెడ్డులో ఉండాలనుకుంటున్నట్టు ఇప్పటికే సీఎం తెలుపడం జరిగింది. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని.. అందువల్లనే ఒక షెడ్డును కట్టించుకొని దానినే క్యాంపు ఆఫీస్ గా వాడుకుంటానని తెలిపారు. ఇలా ప్రజా డబ్బును వృధా ఖర్చు చేయకుండా ప్రజల అవసరాలకు వాడేవిధంగా రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కర్ని ఎంతో సంతోష పెడుతున్నాయి. ఇదే కదా రాష్ట్ర ప్రజలు కోరుకున్నది అంటూ చెపుతున్నారు.

Read Also : MLC Takkallapalli Ravinder Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ..కాంగ్రెస్ గూటికి చేరతారా..?

  Last Updated: 15 Dec 2023, 08:01 PM IST