Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దని మంత్రి (Minister) కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిభకలిగిన ఏ నిరుపేద విద్యార్ధి చదువులు ఆర్ధిక ఇబ్బందులతో ఆగిపోకూడదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్నరనే విషయం తెలిస్తే తన హృదయం తల్లడిల్లిపోతుందని తెలిపిన ఆయన.. ప్రతిభావంతులకు అండగా నిలబిడితే సమాజానికి మంచి జరుగుతుందని తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా ఎలికట్టకు చెందిన గుండె యుగేందర్, వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి శశి ప్రకాష్, గుండ్రంపల్లికి చెందిన రుద్రారపు కావేరీలు ఎంబీబీఎస్ సీట్లు సాధించినప్పటికి ఆర్ధిక సమస్యలతో చదువులు ఇబ్బందిగా మారాయనే విషయం చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నర్సింహా ద్వారా తెలుసుకున్న మంత్రి.. ముగ్గురు విద్యార్ధులను హైదరాబాద్ కు పిలిపించుకొని ఒక్కక్కరికి 65 వేల రూపాలయ చొప్పున ఆర్ధిక సహాయం చేశారు.
ఇవే కాదు రాబోయే రోజుల్లో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 5 సంవత్సరాలకు సంబంధించిన ఫీజును చెల్లిస్తానని, చదువులకు అయ్యే ఇతర ఖర్చులు భరిస్తానని మంత్రి వారికి భరోసా కల్పించారు. మంచిగా చదువుకొని.. డాక్టర్లుగా పేదలకు సేవచేసి మంచిపేరు సంపాదించుకోవాలని ఆశీర్వదించారు.
Also Read: Apollo Medical College Convocation Utsav: అట్టహాసంగా అపోలో మెడికల్ కాలేజీ కాన్వకేషన్ ఉత్సవం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ ఎంతో అప్యాయంగా మాట్లాడరని.. సారే స్వయంగా మా ఇబ్బందులు తెలుసుకొని, 5 సంవత్సరాల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారని విద్యార్ధులు తెలిపారు. మంచిగా చదువుకొని పేదవాళ్లకు సేవ చేయాలని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు మాలో ఎక్కడలేని స్పూర్తి నింపాయని వారు తెలిపారు. ఒక్క సంవత్సరం చదువులకే నానా ఇబ్బందులు పడుతూ, లోలోన భయపడుతున్న మాకు.. కోమటిరెడ్డి సర్ భరోసా కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మాలాంటి ఎందరో నిరుపేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడుతున్న కోమటిరెడ్డి సార్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నట్లు విద్యార్ధులు తెలిపారు.