Site icon HashtagU Telugu

Indiramma house : ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దు: ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సూచన

Indiramma Houses

Indiramma Houses

Indiramma house : న్యాక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. న్యాక్‌లో 390 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి మంత్రి ఆర్డర్‌ కాపీలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదే అన్నారు.

Read Also: Caste Census : భట్టి విక్రమార్కను సన్మానించిన బీసీ సంఘాలు

ఇళ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతికత వాడుతున్నాం. ఫేజ్‌-1 నుంచి ఫేజ్‌-4 వరకు జాగ్రత్తగా సిఫారసు చేయాలి. అర్హులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలూ పరిశీలించాలి. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదు అని పొంగులేటి తెలిపారు. తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. టోల్‌ఫ్రీ నెంబర్‌ ఇస్తాం.. దానికి ఫోన్‌ చేసి వివరాలు చెప్పవచ్చు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలి. దీనిలో మరో మాట లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టామని అయితే కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని అలాంటి వాటికి బిల్లులు హోల్డ్ లో పెట్టామన్నారు.

అయితే వీటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి 600 చ.అడుగులు దాటి బేస్ మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈ సారికి మినహాయింపు ఇచ్చి రూ.లక్ష రిలీజ్ చేస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి సోమవారం అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించబోతున్నామని చెప్పారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చివరకు మంత్రిగా నేను ఫోన్ చేసినా ఫేజ్ ల వారీగా వర్క్ పూర్తి కాకుండా బిల్లుల కోసం సిఫార్సు చేయవద్దని.. ఇంజినీర్లు ఫేజ్-1 నుంచి ఫేజ్ -4 వరకు జాగ్రత్తగా సిఫారసు చేయాలన్నారు.

Read Also:  Russia : రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా రష్యా విక్టరీ డే వేడుకలకు హాజరు కాకపోవచ్చు!