Don KTR: డాన్ కేటీఆర్.. చక్కర్లు కొడుతున్న ఓల్డ్ పిక్

నిత్యం సభలు, సమావేశాలు బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ (KTR) డాన్ అవతారమెత్తాడు

  • Written By:
  • Updated On - December 17, 2022 / 01:27 PM IST

తెలంగాణ (Telangana) ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు.. స్టైల్ ఐకాన్ కూడా. తన అమెరికా పర్యటనకు సంబంధించిన త్రోబాక్ పిక్ ను షేర్ చేశారాయన. ఇప్పుడు అది ఇంటర్నెట్‌లో వైరల్ (Viral Pic) అవుతోంది. ప్రజల సమస్యలపై స్పందించడమే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు కేటీఆర్. బాల్యం, కాలేజీ, గుర్తుండిపోయే క్షణాలను షేర్ చేసుకోవడం ఆయనకు చాలా ఇష్టం. కొన్ని గంటల క్రితం, మంత్రి కేటీఆర్ తన యుఎస్ ట్రిప్ నుంచి ఒక చిత్రాన్ని పంచుకున్నారు. అతను నల్ల జాకెట్ ధరించి, బ్లాక్ కలర్ స్పెక్టికల్స్ తో ఆకట్టుకున్నాడు. తన పోస్ట్‌కి “#Throwback #SanDiego #DonMode” అని శీర్షిక పెట్టాడు. ఇప్పుడు అతని డాన్ లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ (KTR) విరుచుకుపడుతున్నారు. తాజాగా మరోసారి ఆయన మోడీ ప్రభుత్వం మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది కామన్‌మ్యాన్‌ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ, కార్పొరేట్‌ కంపెనీలను మేపుతున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సెస్సులు, పన్నులతో దేశ ప్రజానీకానికి భారంగా మారిన పెట్రోల్‌ ధరలు తగ్గించేందుకు చేతులు రాని బీజేపీ (BJP Govt) ప్రభుత్వం.. ఆయిల్‌ కంపెనీలకు మాత్రం విండ్‌ఫాల్‌ ట్యాక్సులు తగ్గించడం ఏమిటని మండిపడ్డారు.

ప్రధాని మోదీ కార్పొరేట్‌ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని కేంద్రం తగ్గించిందని కేటీఆర్‌ (KTR) విమర్శించారు. మోదీ ప్రభుత్వం భారీగా పెంచిన సెస్సుల ఫలితంగానే పెట్రో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం సుంకాలను తగ్గిస్తే పెట్రోల్‌ 70 రూపాయలకు, డీజిల్‌ 60 రూపాయలకే ప్రజలకు అందించవచ్చని తెలిపారు. 2014 నుంచి సెస్సులను అడ్డగోలుగా పెంచుతూ దేశ ప్రజల నుంచి 30 లక్షల కోట్లను కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం దోచుకుందని ధ్వజమెత్తారు.

Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం