Dogs Attack : రేవంత్ అంకుల్ ..కుక్కల దాడి నుండి మమ్మల్ని రక్షించండి – చిన్నారుల విన్నపం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లిలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. రోడ్ ఫై కనిపిస్తే చాలు వెంటపడి కరిచేస్తున్నాయని.. కుక్కలని అదుపు చేయాలనీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు

  • Written By:
  • Publish Date - July 21, 2024 / 07:17 PM IST

హైదరాబాద్ (Hyderabad) లో వీధికుక్కలు (Stray Dogs) బెడద రోజు రోజుకు ఎక్కువైపోతోంది..ఒంటరిగా వెళ్లాలంటే భయం వేస్తుంది. ఎక్కడి నుండి ఎన్ని కుక్కలు దాడి చేస్తాయో అర్ధం కావడం లేదు. కుక్కలా దాడిలో పలువురి మరణాలు , గాయాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ వీటిని అరికట్టడం లో మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ క్రమంలో ‘సీఎం రేవంత్ అంకుల్ కుక్కల నుంచి రక్షణ కల్పించండి’ అంటూ ఫ్లకార్డులతో చిన్నారులు విన్నవించడం ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

మేడ్చల్ జిల్లా జీడిమెట్లకు చెందిన చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి ఆదివారం పోలీస్ స్టేషన్‍‌కు చేరుకుని అధికారులపై ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లిలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. రోడ్ ఫై కనిపిస్తే చాలు వెంటపడి కరిచేస్తున్నాయని.. కుక్కలని అదుపు చేయాలనీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.

రీసెంట్ గా కుక్కల దాడుల ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేసిన ఉన్నత న్యాయస్థానం.. ఈ సమస్యపై పరిష్కార మార్గాలతో రావాలని, కుక్కల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన ఘటనలు రోజురోజుకు వెలుగు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని పేర్కొంది.

Read Also : Chandrayaan-3: ఇటలీలో ప్రపంచ అంతరిక్ష అవార్డును అందుకోనున్న చంద్రయాన్-3

Follow us