Site icon HashtagU Telugu

Telangana; రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే కుట్ర..?

Telangana

Telangana

Telangana; కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాలుగుగా చీలిపోతుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అంటూ చేసిన రాజకీయ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీశాయి. హరీష్‌రావు సీఎం కావాలనే యోచనలో ఉన్నారని సెటైర్‌ విసిరారు కోమటిరెడ్డి. కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకు వస్తే మద్దతిస్తామని చెప్పారు. తద్వారా కవిత, హరీష్, కేటీఆర్ పేర్లతో పార్టీ చీలిపోతుందని కామెంట్స్ చేశారు.

కేసీఆర్‌ను ఎదిరించి బయటకు వస్తే హరీష్‌రావుకు మద్దతిస్తాం అని చేసిన కామెంట్స్ ద్వారా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? అసెంబ్లీ లాబీల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… హరీశ్‌రావు వ్యాఖ్యలు కేసీఆర్‌, కేటీఆర్‌లను వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలించడం రాకపోతే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి ఎలా పరిపాలించాలో చూపగలనnనిహరీష్ రావు అన్నారు. రైతులకు ఎలా నీళ్లు ఇవ్వాలో రేవంత్‌రెడ్డికి తెలియకపోతే చూపిస్తాం. వైఫల్యం ఒప్పుకుని రాజీనామా చేయనివ్వండి. నీరు ఎలా ఇవ్వాలో చూపిస్తామన్నారు.

హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత కావాలంటే కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. హరీష్ పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ చేతి కర్రతో నడుస్తున్నారని మండిపడ్డారు. అతను పులి ఎలా అవుతాడు, 60 కిలోల బరువున్న వ్యక్తి పులిగా మారగలిగితే, 86 కిలోల బరువుతో నేను ఎలా ఉండాలి, రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కొనసాగుతుందని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేసినా, కేసీఆర్ ను ఎదిరించి బయటకు వస్తే హరీష్ రావుకే మద్దతిస్తాం అని ఆయన వ్యాఖ్యానించడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. నిజంగా హరీష్ రావు బయటకు వస్తే కోమటిరెడ్డి అండ్ కో మద్దతిస్తారా? ముఖ్యమంత్రిగా హరీష్‌రావుకు మద్దతివ్వడానికి రేవంత్‌రెడ్డిని గద్దె దించగలనని ఆయన చెప్పాలనుకుంటున్నారా? అనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Also Read: Bandi Sanjay : కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలిః బండి సంజయ్ డిమాండ్

Exit mobile version