హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీట్ చేశారు వైద్యులు. ఈ మూవీలో ఆసుపత్రి దోపిడిని బయటపెట్టేందుకు చిరంజీవి…వైద్యం పేరుతో జనాలను ఎలా దోచుకుంటున్నారో తెలిపిందుకు ఓ ట్రిక్ ప్లే చేస్తాడు. మరణించిన వ్యక్తిని చావు బతుకుల్లో ఉన్నాడంటూ…వైద్యం అందించాలంటూ ఓ శవాన్ని వైద్యుల వద్దకు తీసుకెళ్తాడు. చిరంజీకి ప్లే చేసిన ట్రిక్ కు పడిపోయిన డాక్టర్లు…శవానికి వైద్యం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తారు. డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెస్తారు. కానీ చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ చూపించడంతో…అంతా షాక్ అవుతారు. అలాంటి సీన్ ఇఫ్పుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రిపీట్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే…తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ…డెలివరీ కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. ఆదివారం సాయంత్రం ఆమె సిజేరియన్ చేశారు వైద్యులు. మగబిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఈ విషయం చెప్పకుండా మెరుగైన వైద్యం అందించాలంటూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పటిల్ కు తరలించారు వైద్యులు.
ఆమెకు వైద్యం అందుతుందని..కోలుకుంటుందని..చెప్పారు. కొద్దిసేపటికే తమ ప్రయత్నం ఫలించలేదని ఆమె మరణించిదని చెప్పారు. అనుమానం వచ్చి మృతురాలి బంధువులు గొడవకు దిగారు. దీంతో ఆమనగల్లు ఆసుపతరి వైద్యులు మృతురాలి కుటుంబానికి రూ. 8లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని…ఒప్పంద ప్రతం రాసిచ్చారు.