Madhavi Latha vs Owaisi : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకుగానూ 9 సీట్లకు అభ్యర్థుల పేర్లను బీజేపీ అనౌన్స్ చేసింది. వాటిలో అత్యంత కీలకమైంది హైదరాబాద్ పార్లమెంట్ స్థానం. ఎంఐఎం అడ్డాగా పేరొందిన ఈ స్థానం నుంచి కొంపెల్లి మాధవీ లతను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈసారి మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్‌పై మాధవీ లత పోటీ చేయనున్నారు. ఇంతకీ మాధవీ లత ఎవరు ? అని జనాలంతా గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు.. విరించి ఆస్పత్రుల చైర్ పర్సన్ కొంపెల్లి మాధవీ లత. మతపరమైన కార్యక్రమాల్లో మాధవీలత చురుగ్గా పాల్గొంటుంటారు. ఎన్ఎసీసీ క్యాడెట్‌గా.. భరతనాట్య నర్తకిగా.. క్లాసికల్ మ్యూజికల్ సింగర్‌గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై మాధవీలత అనర్గళంగా మాట్లాడగలరు. పాతబస్తీలో తరుచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతూ ఆమె ప్రజలతో మమేకం అవుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్న మాధవికి టికెట్ ఇస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకత్వం నుంచి ఢిల్లీ పెద్దలకు ఓ రిపోర్టు వెళ్లింది. దీంతో ఆమెకు హైదరాబాద్ టికెట్ కన్ఫార్మ్ అయింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఒవైసీని ఓడించాలనే లక్ష్యంతోనే ఆర్థిక బలం, అంగ బలం కలిగిన మాధవీలతకు(Madhavi Latha vs Owaisi) బీజేపీ అవకాశం ఇచ్చిందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
గతంలో రెండు, మూడుసార్లు..
కొంపెల్ల మాధవీ లత కోఠిలోని మహిళా కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. ప్రస్తుతం విరించి హాస్పిటల్స్ చైర్‌పర్సన్ గా సేవలు అందిస్తున్నారు. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ కూడా ఆమెదే. మాధవీ లత లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ప్రసిద్ధి. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఎన్ఎసీసీ క్యాడెట్‌గా, క్లాసికల్ మ్యూజికల్ సింగర్‌గా సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేతలు రెండు,మూడుసార్లు రెండో స్థానంలో నిలిచారు కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
Also Read : ISPL 2024: మార్చి 6 నుంచి ఐఎస్‌పీఎల్ ప్రారంభం
2004 సంవత్సరం నుంచి..
2004 సంవత్సరం నుంచి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. అసదుద్దీన్ కు ముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1984 నుంచి 2004 వరకు రెండు దశాబ్దాలపాటు పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. ఈ లెక్కన హైదరాబాద్ పార్లమెంటు సీటు.. 1984 నుంచి నాలుగు దశాబ్దాలుగా ఒవైసీల అడ్డా. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ నేత వినోద్ తావడే, అర్జున్ పాండేతో కలిసి పలు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. శుక్రవారం రోజే బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ పేరు కూడా లోక్‌సభ అభ్యర్థుల లిస్టులో ఉంది. ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లపై బీజేపీ మరోసారి నమ్మకం ఉంచింది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిలో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు అదే స్థానం నుంచి బరిలో నిలుపుతోంది బీజేపీ.