Site icon HashtagU Telugu

Dog Bite : హైదరాబాద్ లో 10 ఏళ్లలో కుక్క కాటు కేసులు ఎన్నో తెలుసా..?

Dog Bite

Dog Bite

హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా కుక్కల (Dods) బెడద ఎక్కువైందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు నగరంలో పదుల సంఖ్యలో కుక్క కాటు (Dog Bite) కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు ఎవరని వదిలిపెట్టకుండా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఒంటరిగా వీధుల్లో కనిపిస్తే చాలు..ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో వచ్చి దాడులు చేస్తున్నాయి. ఇటీవల కుక్కల దాడికి ఎంతో మంది పసిపిల్లలు మృత్యువాతపడ్డారు. కుక్కల నుండి కాపాడండి మహాప్రబో అని నగరవాసులు వేడుకుంటున్న GHMC మాత్రం హడావిడికే పరిమితమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వీధికుక్కల ఫై దృష్టి సారించి కట్టడి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా గడిచిన పదేళ్లలో నగరవ్యాప్తంగా నమోదైన కుక్క కాటు కేసులను తెలిపి షాక్ ఇచ్చారు. 2014 నుంచి 2024 మధ్యకాలంలో 4 లక్షల కుక్కల బెడద ఫిర్యాదులతో పాటు గత దశాబ్దంలో నగరంలోనే 3 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని పౌర సంఘం డేటా వెల్లడించింది. ఈ లెక్కల ను బట్టి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2023లో కుక్కల దాడుల కారణంగా హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్ 75వేలకు మించి రేబిస్ టీకాలు వేసినట్లు వెల్లడించింది. ఇక ABC (యాంటీ రేబిస్ ప్రోగ్రామ్‌)ను అమలు చేయడానికి GHMC ఆరు షెల్టర్ మేనేజర్‌లు, 22 పారా-వెటర్నరీ వైద్యులు, 362 సెమీ-స్కిల్డ్ వెటర్నరీ వర్కర్లను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించింది. ప్రస్తుతం ప్రజల్లో రౌండ్-ది-క్లాక్ డాగ్ క్యాచింగ్ ఆపరేషన్ల అవహగానా పెంచాలని డిసైడ్ అయ్యింది.

‘కమిటీ సలహా ప్రకారం మేము కుక్కలను పట్టుకోవడంలో మూడు షిఫ్టులను నిర్వహిస్తాం. ABC-AR కార్యక్రమం గురించి రెసిడెన్షియల్ అసోసియేషన్లు, పాఠశాలల్లో అవగాహన పెంచుతాం. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి మార్గదర్శకాలను అందిస్తాం’ అని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. ఇక జనంపై వీధి కుక్కల దాడులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టేట్ లెవల్ కమిటీలు వేయడం కాదని.. దాడులు నివారించాలని తేల్చి చెప్పింది.

Read Also : Nani : బలగంపై ప్రేమ.. నాని ఎల్లమ్మ పరిస్థితి ఏంటి..?

Exit mobile version