హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఐటీ కారిడార్ (IT Corridor) చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరాస్తి ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే అలాంటి వారికి సరైన పరిష్కారంగా ఎదుగుతున్న ప్రాంతం కిస్మత్ పూర్ (Kismatpur ). ఇది గండిపేట మండలంలో, హిమాయత్ సాగర్ సమీపంలో ఉంది. అప్పా జంక్షన్, రాజేంద్రనగర్ మార్గం, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది ప్రశాంతమైన వాతావరణంతో పాటు మంచి రవాణా సౌకర్యాలు కలిగిన ప్రదేశంగా ఉంది.
YCP : జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎవ్వరు ముందుకు రావడం లేదు !
ఇక్కడ ప్రస్తుతం భారీగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్‌కి సమీపమైనా ఇక్కడ స్క్వేర్ ఫీట్ ధరలు రూ.5000 నుండి రూ.7000 మధ్యనే ఉండటం విశేషం. గేటెడ్ కమ్యూనిటీల నుంచి చిన్న అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల వరకు వివిధ రకాల గృహ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మానవ వనరుల పెరుగుదల, ఐటీ ఉద్యోగుల రాకతో డిమాండ్ అధికమవుతోంది. అందువల్లే ఈ ప్రాంతం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ స్పాట్‌గా మారుతోంది.
కిస్మత్ పూర్‌లో ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థలు అడుగుపెట్టాయి. సాకేత్ శ్రీయమ్, శ్రీరామ్ ఎస్టేట్స్, వసంత్ సిటీ వంటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రెస్టీజ్ ట్రాన్క్విల్, అపర్ణా వంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా విల్లా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ ఆసుపత్రులు వంటి వసతులు లభ్యమవుతుండటంతో నివాసానికి అనువైన ప్రదేశంగా మారుతోంది. ఐటీ కారిడార్ పరిధిలో తక్కువ ధరకు ఇల్లు కొనే అవకాశాన్ని వెతుకుతున్నవారు కిస్మత్ పూర్‌కి తప్పక ఓ లుక్ వెయ్యండి.