తెలంగాణ రాష్ట్రంలోని పలు మెడికల్ షాపుల్లో ( Medical Shops) నకిలీ మందులు (Counterfeit Medicine) అమ్ముతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ (Drug Control Department) ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 296 మెడికల్ షాపుల్లో సుదీర్ఘ తనిఖీలు నిర్వహించగా, వాటిలో 6 దుకాణాల్లో సుమారు 300 రకాల మందులు నకిలీగా పరిగణించబడ్డాయి. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా ఉన్న ఈ పరిస్థితి అత్యంత ఆందోళన కలిగించే విషయం.
Union Cabinet Meeting : రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ
ఈ నేపధ్యంలో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డీజీ షానవాజ్ ఖాసిం స్పందిస్తూ.. ప్రజలు మెడికల్ షాపుల్లో మందులు కొనేముందు క్యూఆర్ కోడ్‌ను తప్పకుండా స్కాన్ చేయాలని సూచించారు. ఫార్మసీ దుకాణాల్లో దొరికే ప్రతి ఔషధంపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా దాని వాస్తవికతను నిర్ధారించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సాంకేతిక వ్యవస్థను వినియోగించుకోవడం ద్వారా నకిలీ మందుల నుంచి రక్షణ పొందవచ్చు.
ప్రజల భద్రత దృష్టిలో పెట్టుకొని, డ్రగ్ కంట్రోల్ శాఖ 300 రకాల నకిలీ ఔషధాల జాబితాను అధికారిక వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆసక్తిగల వినియోగదారులు ఈ జాబితాను సందర్శించి తమ వద్ద ఉన్న మందులు అసలైనవేనా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఈ జాగ్రత్తలతోనే నకిలీ ఔషధాల వాడకాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం సాధ్యమవుతుంది.