Phone Tapping Case : తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ మేరకు హరీష్ రావు ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును క్వాష్ చేయాలని హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్‌రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈనెల 12న సీనియర్ లాయర్‌తో వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరారు.
Read Also: Delhi Elections 2025 : ఢిల్లీ పీఠం ఏ పార్టీ ఎక్కువ సార్లు దక్కించుకుందో తెలుసా..?
కాగా, ఫోన్ టాపింగ్ ఆరోపణలలో హరీష్ రావు పై డిసెంబర్ 3 మంగళవారం రోజున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. హరీష్ రావును అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఇక ఇదే కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో రెండు షూరిటీలూ సమర్పించాలని ఆదేశించింది.
ఈ కేసులో మెుదట వారు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్‌ను రెండు సార్లు తిరస్కరించింది. దీంతో ఇద్దరూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పది నెలలుగా జైలులో ఉన్నామని, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే వ్యక్తిగతమైన పాస్ పోర్టులు సైతం సమర్పించాలని చెప్పింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న దృష్ట్యా పోలీసులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయెుద్దంటూ భుజంగరావు, రాధాకిషన్ రావును హైకోర్టు ఆదేశించింది.
Read Also: Caste Census Survey : కుల గణనతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది – భట్టి