Hyderabad: ఎన్నికల కోడ్.. DLF మూసివేత

హైదరాబాద్​ నగరంలో రోజురోజుకూ ఫుడ్​ ఇండస్ట్రీలు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తూ.. కొత్త థీమ్​తో రెస్టారెంట్​లు ప్రతి చోట వెలుస్తున్నాయి. నగరంలో ఫుడ్ అడ్డాగా మారింది.

Hyderabad: హైదరాబాద్​ నగరంలో రోజురోజుకూ ఫుడ్​ ఇండస్ట్రీలు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తూ.. కొత్త థీమ్​తో రెస్టారెంట్​లు ప్రతి చోట వెలుస్తున్నాయి. నగరంలో ఢిఎల్ఎఫ్ ఫుడ్ అడ్డాగా మారింది. సాయంత్రం 7 దాటితే యువత గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ సెంటర్ కు వచ్చేస్తారు. మిడ్ నైట్ ఫుడ్ ని ఎంజాయ్ చేసేవారికి డీఎల్‌ఎఫ్ ఒక ఆప్షన్ గా మారిపోయింది. చుట్టూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉండటంతో రాత్రయితే ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది. అయితే ఇకపై అక్కడ 11 గంటలు దాటితే హోటల్స్ మూసివేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ వీధిలో వ్యాపారులు రాత్రి 11 గంటలలోపు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.బిర్యానీల నుండి కబాబ్‌ల వరకు ఈ ప్రదేశం ఆహార ప్రియుల స్వర్గధామంగా పరిగణించబడుతుంది. సాధారణ రోజులలో రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉంటుంది.

డీఎల్‌ఎఫ్ వీధిలో మాగీ, దోసె, మోమోలు, పండ్ల రసాలు మరియు ఐస్‌క్రీమ్‌, షవర్మా, బిర్యానీ మరియు కబాబ్‌ల వంటి రుచికరమైన ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది.రాత్రిపూట ఈ ప్రదేశం యువతతో కిక్కిరిసిపోతుంది. యూత్ కి ఈ ప్లేస్ హ్యాంగ్అవుట్ వేదికగా మారిపోయింది. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను దృష్టిలో 11 గంటల తర్వాత హోటల్స్ మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాపారంలో తమకు గణనీయమైన నష్టం వాటిల్లుతుందని స్టాల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కస్టమర్లు ప్రధానంగా నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారు రాత్రిపూట భోజనం కోసం ఈ స్ట్రీట్ ఫుడ్ పై ఆధారపడే వారు కూడా ప్రభావితమవుతారు.

Also Read: Heart Attack: కోవిడ్-19 బాధితులు వ్యాయామాలు చేయకండి: కేంద్రం