Site icon HashtagU Telugu

Telangana Congress: అంతా డీకే నేనా..? బెంగళూరు వేదికగా తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల కీలక భేటీలు

Richest MLA

DK Shivakumar Meeting with Telangana Congress Leaders in Bengaluru

తెలంగాణ‌(Telangana)లో కాంగ్రెస్(Congress) పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది. క‌ర్ణాట‌క(Karnataka) రాష్ట్రంలో ఆ పార్టీ ఘ‌న విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో.. తెలంగాణ‌లోనూ ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క ఫ‌లితాల వ‌ర‌కు తెలంగాణ‌లో బీఆర్ఎస్(BRS) పార్టీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీ(BJP) అని అంద‌రూ భావించారు. కానీ ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పుంజుకుంది. దీనికితోడు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లంతా ఒకేతాటిపైకి వ‌చ్చి స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదేన‌నే ధీమాను ఆ పార్టీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇత‌ర పార్టీల్లోని ప‌లువురు నేత‌లు క్యూ క‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్ బ‌హిష్కృత నేత‌లు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేర‌డం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి ఇంకా ఏ పార్టీలో చేరేది నిర్ణ‌యించుకోలేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీలో వారు చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే, వీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు? వారి వెంట వ‌చ్చేవారికి సీట్ల కేటాయింపు, పార్టీ ప‌ద‌వుల కేటాయింపు త‌దిత‌ర అంశాల‌పై కేంద్ర పార్టీ అధిష్టానం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ పొందేందుకు జూప‌ల్లి, పొంగులేటి ఎదురు చూస్తున్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల వ్య‌వ‌హారం అంతా కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే శ‌నివారం జూప‌ల్లి, పొంగులేటితో పాటు కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు రాజేష్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో క‌లిసి బెంగ‌ళూరు వెళ్లిన‌ట్లు తెలిసింది. వారు బెంగ‌ళూరులో డీకే శివ‌కుమార్‌తో భేటీ అయిన‌ట్లు, ఈ భేటీలో పొంగులేటి, జూప‌ల్లి ప‌లు విష‌యాల‌ను డీకే శివ‌కుమార్ దృష్టికి తీసుకెళ్లార‌ని స‌మాచారం. వారు చెప్పిన విష‌యాల‌ను డీకే శివ‌కుమార్ కేంద్ర పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. వారి సూచ‌న మేర‌కు మ‌రో రెండు మూడు రోజుల్లో పొంగులేటి, జూప‌ల్లి, కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో చ‌ర్చ‌జ‌రుగుతుంది.

 

Also Read : Telangana Congress: కోమటిరెడ్డి ఇంట్లో జూపల్లి కృష్ణారావు భేటీ