Site icon HashtagU Telugu

DK Shivakumar : ఈరోజు , రేపు తెలంగాణ లో పర్యటించబోతున్న డీకే శివకుమార్

Dk Shivakumar Ts

Dk Shivakumar Ts

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ప్రచారంలో భాగంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ (DK Shivakumar) రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఇప్పటీకే పలుమార్లు ఆయన ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా..ఈరోజు , రేపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం బెంగుళూరు నుంచి ఉదయం హైదరాబాద్‌ (Hyderabad)కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు. డీకే శివకుమార్‌తోపాటు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ప్రచారానికి హాజరవుతారు. ఆ తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుండి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రి అంబర్‌పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈరోజు రాత్రి హైదరాబాద్ లోనే బస చేసి..రేపు ( నవంబర్ 25న) హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాలలో రోడ్ షో లు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొంటారు.

Read Also : సీఎం కేసీఆర్ దోచుకున్న ప్రజాధనాన్ని మొత్తం కక్కిస్తా – రేవంత్