DKS Vs KCR : మా ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు కేసీఆర్ యత్నం : డీకే శివకుమార్‌

DKS Vs KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై​ కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 01:36 PM IST

DKS Vs KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై​ కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ట్రాప్​ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ స్వయంగా సంప్రదించిన విషయాన్ని పార్టీ అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణలో సునాయాసంగా హస్తం పార్టీ అధికారంలోకి వస్తుంది. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండబోదు’’ అని డీకే శివకుమార్‌ తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్​ పోల్స్ అన్నీ.. తెలంగాణలో హస్తం పార్టీదే అధికారం అని తెలిపాయి. దీంతో హస్తం పార్టీ జోష్‌లో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్‌ .. గెలిచే అభ్యర్థులు చేజారిపోకుండా చూసేందుకు చకచకా పావులు కదుపుతోంది. ఈ విషయంలో పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపిస్తోంది. ‘‘నేను హైదరాబాద్‌‌కు వెళ్తున్నాను. మా ఎమ్మెల్యేలంతా మా వెంటే ఉంటారు. మేం చాలా జాగ్రత్తగా ఉన్నాం’’ అని డీకే శివకుమార్‌ తెలిపారు.

Also Read: Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం ఆహ్వాన లేఖ ఎంతమందికి పంపారంటే ?

‘‘సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ను నేను నమ్మను. నా సొంత పోస్ట్‌ పోల్‌ సర్వేలు చేయిస్తాను. నా సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద వేవ్‌ ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పవర్‌లోకి రావడం ఖాయం. కాంగ్రెస్‌ నేతలను కేసీఆర్‌ లాక్కోవడం ఈసారి కుదరదు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో గెలిచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరు. వారంతా పార్టీకి విధేయులు’’ అని డీకే శివకుమార్‌(DKS Vs KCR) వివరించారు.