Dk Aruna – Kavitha: కవిత వ్యాఖ్యలపై స్పందించిన డీకే అరుణ.. అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ?

తాజాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితులలో ఒకరైన అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేసిన

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 05:54 PM IST

తాజాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితులలో ఒకరైన అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే తాజాగా ఇదే విషయం పై కవిత స్పందిస్తూ బిజెపి ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై పలువురి బిజెపి నేతలు ఆమెపై మండిపడుతున్నారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ పోర్టులలో తన పేరును ప్రస్తావించడంతో కవిత స్పందిస్తూ.. కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని అని కవిత మాట్లాడడంతో ఆమెపై మండిపడింది డీకే అరుణ. ఈ నేపథ్యంలోనే తాజాగా కవితపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు అయిన డీకే అరుణ నిప్పులు చెలరేగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సానుభూతి కోసమే కవిత ఇలా కుటుంబ డ్రామాలు ఆడుతుందంటూ విమర్శించారు.

చేసిన తప్పులు బయటపడతాయనే బీజేపీ పై ఎదురుదాడి చేస్తున్నారని అరుణ ఆరోపించింది. ఒకవేళ కెసిఆర్ కుటుంబ సభ్యులు ఎటువంటి తప్పు చేయకపోతే ఎందుకు ఈడీ సీబీఐ దాడులకూ భయపడుతున్నారు అంటూ ఆమె ప్రశ్నించింది. అలాగే కవిత జైలుకు వెళితే అది ఆమె చేసిన అవినీతి వల్లనే అని తెలిపింది అరుణ. అయితే అదేదో ప్రజల కోసం ఆమె పోరాటం చేసి జైలుకు వెళ్లేందుకు సిద్దమన్నట్టుగా కవిత మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అంటూ కవిత పై విరుచుకుపడింది అరుణ.