Telangana : రేవంత్ రెడ్డి ఓ దోకేబాజ్ – డీకే అరుణ

రేవంత్ రెడ్డి..ప్రజలకు సేవ చేసేందుకు రాలేదని.. ఉన్నది ఊడ్చుకుపోయేందుకు వచ్చిన దోకేబాజ్ అంటూ విమర్శించారు

Published By: HashtagU Telugu Desk
Dk Aruna Nsp

Dk Aruna Nsp

ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడేసమయానికి రావడంతో పార్టీల అభ్యర్థులు ఘటన వ్యాఖ్యలు చేస్తూ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ లో లోక్ సభ ప్రచారం హోరా హోరీగా నడుస్తుంది. ఈరోజు బీజేపీ – కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ..ఈసారి తెలంగాణ లో బిజెపి విజయ డంఖా మోగించాలని చూస్తున్నారు. అందుకే వరుస పెట్టి సభల్లో పాల్గొంటున్నారు. మొన్ననే వేములవాడ , హన్మకొండ సభల్లో పాల్గొన్న ఆయన..ఈరోజు నారాయణపేట సభలో పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ..సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి..ప్రజలకు సేవ చేసేందుకు రాలేదని.. ఉన్నది ఊడ్చుకుపోయేందుకు వచ్చిన దోకేబాజ్ అంటూ విమర్శించారు. ప్రధాని మోడీ ఆశీర్వాదంతో తాను మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తుంటే.. తన గెలుపు పక్కా తెలిసి రేవంత్‌రెడ్డి తన సీఎం పదవి పోతుందంటూ ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలమూరులో అభివృద్ధి పథంలో నడవాలంటే అరుణమ్మ గెలుపు అవసరమని తెలిపారు. తనపై సీఎం నోటికొచ్చిన భాషలో మాట్లాడుతున్నాడని..పండబెట్టి తొక్కుతా అంటున్నాడని.. ఆయనకు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడికి గురైందని. కాంగ్రెస్ పాలనలో ఉన్నది ఊడ్చుకుపోతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేసారు. ఓటుకు నోటు కేసుల అడ్డంగా దొరికినోడు కూడా తన గురించి మాట్లాడుతున్నాడని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చింది.

Read Also : Chiranjeevi : ఎంజీఆర్‌కి భారతరత్న ఇచ్చినప్పుడు.. ఎన్టీఆర్‌కి ఇవ్వాలి.. చిరు కామెంట్స్

  Last Updated: 10 May 2024, 05:33 PM IST