సరోజినీ దేవి కంటి ఆసుపత్రి (Sarojini Devi Hospital) లో టపాసుల పేషంట్లు (Patients ) భారీగా పెరిగిపోయారు. ఆదివారం దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు (Diwali ) ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సామాన్య ప్రజలు , రాజకీయ ప్రముఖులు, సినీ తారలు ఇలా అనేక రంగాల వారు ఎంతో ఉత్సాహంగా టపాసులు కాలుస్తూ దీపావళి ని జరుపుకున్నారు. అయితే కొంతమంది మాత్రం టపాసులు కాల్చే క్రమంలో అజాగ్రత్త వహించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చాలామందికి కంటికి గాయాలు కావడం తో వారంతా హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
టపాసులు కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నగరంతో పాటు నగర శివారులో కనీసం 60 మందికి కంటి గాయాలు అయ్యాయి. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 60 మంది కంటి గాయాలతో సరోజినీ దేవి కంటి దవాఖానకు వచ్చారని వైద్యులు వెల్లడించారు. అయితే వారిలో 45 మంది చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్లగా మిగతా అయిదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారికి వైద్యులు ఆపరేషన్ చేశారు. కాగా వీరిలో ఎక్కువ శాతం 10- 17 సంవత్సరాల వయసు లోపు వారే గాయపడ్డట్టు వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చాలని, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై టపాసులు కల్చవద్దని ఆదేశాలు ఇచ్చినా కొందరు రాత్రంతా సోమవారం ఉదయం వరకు కూడా పేల్చారు.
Read Also : Janareddy : జానారెడ్డి నామినేషన్ ను రిజెక్ట్ చేసిన ఎన్నికల అధికారులు