కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం ఆగడం లేదు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమనే సంకేతాలు బలంగా వీస్తుండడం తో ఇతర నేతలతో (Political Leaders ) పాటు సినీ ప్రముఖులు (Film Stars) సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే అనేక పార్టీల నుండి అనేక మంది కాంగ్రెస్ గూటికి చేరగా..తాజాగా ప్రముఖ సినీ నటి, టీడీపీ మాజీ నేత దివ్యవాణి (Divyavani ) కాంగ్రెస్ లో చేరారు.
బుధువారం ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే (Manikrao Thakre) సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకుంది. 2019లో టీడీపీలో చేరిన దివ్య వాణి.. ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. ఆ తర్వాత పార్టీతో విభేదించి 2022లో రాజీనామా చేశారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
దివ్యవాణి ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచిపేరున్న హీరోయిన్ గా ఉన్నారు. దివంగత దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపుస్తకం సినిమాతో ఆమెకు నటిగా మంచిపేరొచ్చింది. తొలి సినిమా నుంచే దివ్యవాణికి బాపుబొమ్మ అనే పేరుంది. ఆ తర్వాత ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, సంసారాల మెకానిక్, పెళ్లికొడుకు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 40 తెలుగు సినిమాల్లో ఈమె నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత రాధా గోపాళం సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి యాక్టివ్ అయ్యారు.
Read Also : Elon Musk – Gaza : ఆ ఆదాయమంతా గాజా, ఇజ్రాయెల్‌కు ఇచ్చేస్తా : మస్క్