Site icon HashtagU Telugu

Congress: వై.ఎస్‌. టైపు పాద‌యాత్ర అంటే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది?

Ysr Padayartra

Ysr Padayartra

ఏక కాలంలో trs, bjpల పై భారీ స్థాయిలో పోరాటం చేయాల్సి ఉంటుంద‌న‌డంలో congressలో ఏకాభిప్రాయ‌మే ఉంది. ఇందుకోసం పాద‌యాత్ర‌ల ద్వారా ప్ర‌జ‌లకు చేరువ కావ‌చ్చ‌ని ఒకే మాట‌గా చెబుతున్నారు. పాద‌యాత్ర‌లు చేస్తే రాజ‌కీయంగా క‌లిసి వ‌స్తుంద‌ని కూడా నాయ‌కులు అంద‌రూ అంగీక‌రిస్తున్నారు. కానీ, వై.ఎస్‌. టైపు పాద‌యాత్ర అంటే కాంగ్రెస్ భయపడుతోంది.

అయితే ఎవ‌రు పాద‌యాత్ర చేయాల‌న్న‌దానిపైనే పార్టీలో జోరుగా డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఉమ్మ‌డి ఏపీలో దివంగ‌త వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర చేయ‌డం ద్వారా congress ఘ‌న విజ‌యం సాధించిన విష‌యాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. అది నేష‌న‌ల్ లెవ‌ల్ పాలిటిక్స్‌పైనా ప్ర‌భావం చూపింద‌ని చెబుతున్నారు.

ఈ కార‌ణంగా పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఎక్కువ రోజుల పాటు పాద‌యాత్ర చేస్తే బాగుంటుంద‌ని ఒక వ‌ర్గం వారు సూచిస్తున్నారు. ఈ పాయింట్ ద‌గ్గ‌రే ఇంకొంద‌రు అబ్జ‌క్ష‌న్ చెబుతున్నారు.
వై.ఎస్‌. చేసిన పాదయాత్ర‌కు పార్టీ నాయ‌కుల‌తో పాటు, కేడ‌ర్ అంతా క‌ష్ట‌ప‌డింద‌ని, కానీ క్రెడిట్ మొత్తం ఆయ‌నకే ద‌క్కింద‌ని అంటున్నారు. త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల్లో ఆయ‌న బ‌ల‌ప‌డ్డారే త‌ప్ప‌, పార్టీ కాద‌ని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుడే కాకుండా ఇత‌ర నాయ‌కులు కూడా ఎక్క‌డిక‌క్క‌డ పాద‌యాత్ర‌లు జ‌రిపి ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని మ‌రో వ‌ర్గం సూచిస్తోంది.
అంద‌రూ చేస్తే ఫోక‌స్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, దాని వ‌ల్ల బెనిఫిట్ రాదేమోన‌ని కొంద‌రు అంటున్నారు. దీంతో మ‌రికొంద‌రు ఎగ్రీ కావ‌డం లేదు. congress ఒక వ్య‌క్తిపై ఆధార‌ప‌డ్డ పార్టీ కాద‌ని, ఎక్క‌డిక‌క్క‌డ బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నార‌న్న మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌ని వాదిస్తున్నారు. ఇది ఇంకా తేల‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు దీన్ని హైక‌మాండ్ నిర్ణ‌యానికే విడిచిపెట్టాల‌న్న అంగీకారానికి వ‌చ్చారు.