తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం వరకు దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందించనుంది ప్రభుత్వం.
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని మంత్రి ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్ ని సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ రూపొందించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ మూడవ వారం వరకు కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 65 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉంది.
Also Read: Samantha: మానసిక ఆరోగ్యానికి ధ్యానం ఎంతో మేలు: సమంత