హైదరాబాద్ మెట్రో (Hyd Metro) ఈరోజు ప్రయాణికులకు (Passengers) చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్య (Technical Problem) ఏర్పడం తో దాదాపు గంట పాటు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అసలే సోమవారం..టైం కు ఆఫీస్ కు వెళ్లాలని ఇంటి నుండి స్టేషన్ కు చేరుకున్న ఉద్యోగులు..మెట్రో కోసం ఎదురు చూసి చూసి నీరసించిపోయారు. నాగోల్ నుండి రాయదుర్గం రూటు, అలాగే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే రూటు మార్గంలో మెట్రో రైలు ఏక్కడికక్కడే నిలిచిపోయాయి.
ప్రయాణికుల రద్దీతో అమీర్‌పేట జంక్షన్ స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ కిటకిటలాడింది. రైలు కోసం వేచి చూస్తుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఫీడర్ ఛానల్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు మెట్రో సిబ్బంది తెలిపారు. కొద్ది సమయం పాటు తక్కువ వేగంతో మెట్రో రైళ్లను నడిపారు. ఎల్‌బీనగర్- మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్ల ఆలస్యం కారణంగా ప్రతి మెట్రో స్టేషన్ వద్ద కూడా రద్దీ పెరిగి ప్రయాణికులు అసౌర్యానికి గురయ్యారు.
ఇక హైదరాబాద్ మెట్రో విషయానికి వస్తే..నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ మెట్రో అనేది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ అనేది దేశంలోని అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన మరియు భద్రతాయుతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మూడు మార్గాలలో నడుస్తుంది.
రెడ్ లైన్ (మియాపూర్ నుండి ఎల్‌బి నగర్ వరకు)
బ్లూ లైన్ (నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు)
గ్రీన్ లైన్ (ఎంజీబీఎస్ నుండి జుబ్లీ బస్టాండ్ వరకు)
ఈ మార్గాలు కలిపి సుమారు 69 కి.మీ. పొడవుతో ఉన్న హైదరాబాద్ మెట్రో, దేశంలోనే రెండవ పొడవైన మెట్రో రైల్ నెట్‌వర్క్‌గా నిలిచింది. మెట్రో, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని కూడా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మెట్రో స్టేషన్లు నూతన సాంకేతికతలతో, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, మరియు భద్రతా ప్రమాణాలతో సక్రమంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రతి స్టేషన్ వద్ద టికెట్ కొనుగోలు, రీచార్జ్ కోసం టికెట్ విండోలు మరియు కియోస్క్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. మెట్రో ప్రయాణికులు సులభంగా మొబైల్ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే, స్మార్ట్ కార్డ్ ద్వారా మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తోంది.
Read Also : Jogi Ramesh : కూటమిలోకి జోగి రమేష్..?