Disha Encounter: బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను శిక్షించాల్సిందే: బాధితుల బంధువులు.!!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది.

  • Written By:
  • Publish Date - May 21, 2022 / 12:02 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. సుదీర్ఘంగా విచారించిన సిర్ప్కూర్కర్ కమిషన్…ఫేక్ ఎన్ కౌంటర్ ని…ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపారని నిర్ధారించింది. ఈ మేరకు ఎన్ కౌంట్ ఘటనలో పాల్గొన్న పది మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.

ఈ విషయంపై నిందితుల తల్లిదండ్రులు స్పందించారు. ఎన్ కౌంటర్ కు పాల్పడిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు బదిలీ చేసినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని నిందితుల కుటుంబీకులు అంటున్నారు. తమ పిల్లలు నేరం చేస్తే…వారిని న్యాయం శిక్షిస్తుంది కానీ..తక్షణ న్యాయం పేరుతో పోలీసులే ఎన్ కౌంటర్ చేసి చంపారన్నారు. సిర్ప్కూర్కర్ కమిషన్ ముందు తాము ఈ విషయాలనే చెప్పామని …తమకు కమిషన్ న్యాయం చేసినందుకు తాము సంతృప్తి చెందామన్నారు.

నిందితుల్లో ఒకరైన జొల్లు శివ తండ్రి కూమారయ్య మాట్లాడుతూ…నా కొడుకుతోపాటు మరో ముగ్గురిని పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారని కమిషన్ చెప్పాము. వాళ్లు ఏదైనా తప్పు చేసి ఉంటే కోర్టు శిక్షిస్తుండేది కానీ పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు తమకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దోషులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని మహమ్మద్ ఆరీఫ్ తండ్ర మహ్మద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. హైకోర్టుకూడా తమ న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకుందన్నారు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ నిజమేనని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేయించారని గొప్పలు చెప్పుకున్నారు. అప్పటి కమిషన్ సజ్జనార్ ను అందరూ భుజాన ఎత్తుకున్నారు. అప్పట్లో భావోద్వేగాలు అలా ఉన్నాయి. అయితే దిశ అనే యువతిని దారుణంగా హత్య చేశారు. కానీ నిందితులు వాళ్లేనా కాదా అన్నది తేలకుముందే తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేశారు. అది ఇప్పుడు ఫేక్ ఎన్ కౌంటర్ అని సాక్ష్యాలతో సహా తేలింది. ఇప్పుడు పోలీసులకు ఎలాంటి చిక్కులు వస్తాయి. ఫేక్ ఎన్ కౌంటర్ ఫలితం కూడా పోలీసులు అనుభవిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.