TS : అసెంబ్లీ లో నదీజలాల అన్యాయంపై ఉత్తమ్ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 11:43 AM IST

కృష్ణా జలాల రగడ ఇప్పుడు కాంగ్రెస్ vs బిఆర్ఎస్ గా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్​తో అమీతుమీ తేల్చుకోడానికి కాంగ్రెస్‌ సర్కార్ సిద్ధమైంది. సమైఖ్య రాష్ట్ర పాలనలో కన్నా బిఆర్ఎస్ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగినట్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియపరిచింది. కృష్ణా జలాల నిర్ణయాల్లో జరిగిన అన్యాయాలను ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజంటేషన్‌ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు సీఆర్పీఎఫ్ బలగాల నుంచి విముక్తి కల్పించడం సహా తెలంగాణ వాటా తేల్చే వరకు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదంటూ రెండు తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టారు.

మరోపక్క బీఆర్‌ఎస్‌ ఒత్తిడితోనే కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్నదని BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ట్వీట్ చేసారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా రేపు నల్లగొండలో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ వల్లే కాంగ్రెస్‌లో చలనం వచ్చిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌కు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని BRS MLC కవిత మండిపడ్డారు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలున్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు.

 

Read Also : Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం