Discounted challan: రికార్డుస్థాయిలో ‘పెండింగ్’ చలాన్ల క్లియరెన్స్!

డ్రైంక్ అండ్ డ్రైవ్.. సిగ్నల్ జంప్.. అతివేగం.. ర్యాష్ డ్రైవింగ్ లాంటి ఇష్యూస్ కారణంగా ఎంతోమంది వాహనదారులు తమ చలాన్లు చెల్లించాల్సి ఉంది. అయితే వాటికి క్లియరెన్స్ కు ఎవరూ ముందుకు రాకపోవడంతో

Published By: HashtagU Telugu Desk
Challan

Challan

డ్రైంక్ అండ్ డ్రైవ్.. సిగ్నల్ జంప్.. అతివేగం.. ర్యాష్ డ్రైవింగ్ లాంటి ఇష్యూస్ కారణంగా ఎంతోమంది వాహనదారులు తమ చలాన్లు చెల్లించాల్సి ఉంది. అయితే వాటికి క్లియరెన్స్ కు ఎవరూ ముందుకు రాకపోవడంతో తెలంగాణ పోలీసులు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. పెండింగ్ చలాన్లను క్లియరెన్స్ కు పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇచ్చింది. అయితే పోలీస్ యంత్రాంగం ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కు ఊహించని రెసాన్స్ వస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా నిమిషానికి 800 నుంచి 1,000 చలాన్లు క్లియర్ చేయబడ్డాయి.

మొదటి రోజు.. దాదాపు ఐదు లక్షల చలాన్‌లు రాష్ట్ర ఖజానాలో జమ అవుతున్నాయని దాదాపు ₹5 కోట్ల జరిమానాలు జమ అయ్యాయి అని అధికారులు తెలిపారు. “తమ పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను డిస్కౌంట్‌తో క్లియర్ చేయడానికి వాహన యజమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి రోజు దాదాపు రెండు లక్షల చలాన్లు చెల్లించబడతాయని మేం ఊహించాం, కానీ సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 4.1 లక్షల చలాన్లు క్లియర్ చేయబడ్డాయి. సాయంత్రం మరో లక్ష ఉన్నాయి” అని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ (ఎచలన్) ఎం నర్సింగ్ రావు తెలిపారు.

మీ సేవా కేంద్రాలు ఉదయం 10 గంటల తర్వాత తెరవడం వల్ల రద్దీ సమయాల్లో (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు) నిమిషానికి 1000 మందికి పైగా సంఖ్య దాటిందని ఆయన చెప్పారు. అధికారులు తమ వెబ్‌సైట్‌ ద్వారా డబ్బులు చెల్లించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి అని మిస్టర్ రావు చెప్పారు. కాగా జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) హైదరాబాద్ AV రంగనాథ్ మాట్లాడుతూ.. చెల్లించిన ఐదు లక్షల చలానాల వాస్తవ విలువ సుమారు ₹ 20 కోట్లు. అయితే డిస్కౌంట్ తర్వాత వసూలు చేసిన మొత్తం ₹ 5.5 కోట్లు. మార్చి 31 వరకు తగ్గింపు చెల్లుబాటులో ఉన్నందున చలాన్‌లను క్లియర్ చేయడానికి ప్రజలు తొందరపడవద్దని ఆయన కోరారు.

  Last Updated: 02 Mar 2022, 11:28 AM IST