Site icon HashtagU Telugu

Dil Raju : నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీగా దిల్ రాజు..?

Dilraju Mp

Dilraju Mp

సినిమా అండ్ పాలిటిక్స్ నిజానికి ఈ రెండు వేరు వేరు కానీ ఇప్పుడు ఆ రెండు మిక్స్ అవుతున్నాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలు నిర్మిస్తున్నారు. సినిమాల్లో ఉన్న వారు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా ఇరువురు కలిసి సినిమాలు , రాజకీయాలు ఒకేసారి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా , మంత్రులుగా , ఎమ్మెల్యేలుగా ఇలా ఎన్నో పదవుల్లో రాణించి ప్రజలకు సేవ చేసారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతే. చిత్రసీమలో టాప్ హీరోగా చెలామణి అవుతుంటే..సొంతంగా పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం రాజకీయాల్లోకి రాబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు సొంతూరైన నిజామాబాద్ నుండి ఎంపీ గా పోటీ చేయాలనీ చూస్తున్నట్లు ప్రచారం అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజును దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో దిల్ రాజును పోటీలో ఉంచాలని కాంగ్రెస్ భావించినా ఆయన నిరాకరించినట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఆయన పోటీకి సుముఖంగా ఉండటంతో నిజామాబాద్ లోక్ సభ టికెట్ ను కేటాయించాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోపక్క ఇదే సీటును షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఇప్పుడు వీరిద్దరూ నిజామాబాద్ ఎంపీ సీటు కోసం పోటీపడుతున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ టికెట్ ఇస్తుందో చూడాలి.

Read Also : Alla Ramakrishna Reddy : షర్మిల వెంట నడుస్తా – ఆర్కే

Exit mobile version