Digvijay Singh: సీనియర్స్ తో ‘డిగ్గీ’ మంతనాలు.. కాంగ్రెస్ సంక్షోంభంపై వరుస భేటీలు!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) టీకాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు.

  • Written By:
  • Updated On - December 22, 2022 / 03:31 PM IST

గత కొద్ది రోజులుగా పార్టీలో (TCongress) నెలకొన్న సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) గురువారం తెలంగాణ శాఖ అసంతృప్తి నేతలతో సమావేశమయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆయనను హైదరాబాద్‌కు పంపింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో నేతలతో ఆయన స్వయంగా సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ ఇన్‌పుట్‌ల ఆధారంగానే ఆయన హైకమాండ్‌కు నివేదిక అందజేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రముఖ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తొలుత దిగ్విజయ్ సింగ్‌ (Digvijay Singh)ను కలిశారు. ఒక్కో నాయకుడికి 10-15 నిమిషాల సమయం ఇస్తున్నారు. అందరితో సమావేశమైతే సరైన ఫలితం రాదని భావించిన డిగ్గీ రాజా వ్యక్తిగతంగా కలవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు పార్టీ నేతలు ఇతర పార్టీల కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు రావడంతో దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కూడా ఈ అంశంపై దృష్టి సారించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ప్రచారంపై ఓ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలోగా (2023 Elections) పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై వారి మనసులోని మాటను తెలుసుకోవడమే కాకుండా వివిధ నేతల నుంచి సింగ్ సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

2017లో తెలుగుదేశం పార్టీకి (TDP) రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి (Revanth)పై తిరుగుబాటుగా భావించే ఈ బృందం రాష్ట్రంలో సేవ్ కాంగ్రెస్ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. నిజమైన కాంగ్రెస్‌, వలస కాంగ్రెస్ పోరుగా అభివర్ణించింది. అసంతృప్తుల్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండటం మరింత చర్చనీయాంశమవుతోంది.

రేవంత్ రెడ్డి(Revanth)కి విధేయులుగా భావిస్తున్న 13 మంది నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్  సంక్షోభం మరింత ముదిరింది. ప్యానెల్‌లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో కొందరు నేతలు రాజీనామాలు కూడా చేశారు. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు అసమ్మతి వర్గం డిసెంబర్ 20న సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే హైకమాండ్ జోక్యం చేసుకుని సభను నిర్వహించకుండా అడ్డుకున్నారు.

Also Read: BRS MLA Jeevan Reddy: మాది ఫైటర్స్ ఫ్యామిలీ.. బీజేపీది ఛీటర్స్ ఫ్యామిలీ!