Site icon HashtagU Telugu

Digital Lessons : రేపటి నుండి ప్రభుత్వ స్కూల్స్ లలో డిజిటల్ పాఠాలు

Digital Lessons In Governme

Digital Lessons In Governme

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తి స్థాయి డిజిటల్ పాఠాలు అందించేందుకు టి-సాట్ నెట్వర్క్ ప్రణాళిక సిద్దం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుండి 10వ తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయి పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది. విద్యా శాఖ క్యాలండర్ ను అనుసరించి టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రసారాలకు సంబందించి ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత పదిహేను రోజులుగా బ్రిడ్జ్ కోర్స్ పాఠ్యాంశాలు ప్రసారం చేసిన టి-సాట్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబందించి 223 పాఠశాలల పని రోజుల్లో 749 గంటల కంటెంట్ ను 1,498 పాఠ్యాంశ భాగాలుగా విద్యా ఛానల్ లో ప్రసారం చేస్తున్నట్లు సీఈవో వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రాథమిక విద్యకు సంబందించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల ప్రసారాలుంటాయని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలలు పని రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు టి-సాట్ విద్య ఛానల్ లో విద్యార్థులకు అనుగుణంగా పాఠ్యాంశ ప్రసారాలుంటాయని, పాఠశాలల్లో ప్రత్యక్షంగా పాఠాలు వినలేని విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు వినేందుకు చక్కటి అవకాశం కల్పించామని సీఈవో గుర్తుచేశారు. పాఠ్యాంశాలు తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ భాషలోనూ అందుబాటులో ఉన్నాయని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సుమారు 29,478 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 58,98,685 మంది విద్యార్థులు ఈ డిజిటల్ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. పాఠ్యాంశాల కంటెంట్ టి-సాట్ శాటి లైట్ ఛానల్ విద్యతో పాటు టి-సాట్ యాప్, యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంటాయన్నారు.

Read Also : Israel Vs Hezbollah : హిజ్బుల్లాతో యుద్ధానికి ఇజ్రాయెల్ సై.. వాట్స్ నెక్ట్స్ ?