Differences in BJP : బీజేపీలో కుమ్ములాట‌! జితేంద్ర‌రెడ్డి ట్వీట్ దుమారం!!

బీజేపీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట (Differences in BJP) తారాస్థాయికి చేరింది. బీజేపీ నేత జితేంద్ర‌రెడ్డి పెట్టిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

  • Written By:
  • Updated On - June 29, 2023 / 04:31 PM IST

తెలంగాణ బీజేపీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట (Differences in BJP) తారాస్థాయికి చేరింది. దానికి విరుగుడుగా మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేంద్ర‌రెడ్డి పెట్టిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. కాలితో త‌న్ని దున్న‌పోతును వాహ‌నంలో ఎక్కించిన వీడియోను ఆ ట్వీట్ కు లింకు చేశారు. ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు. అది కాస్తా వివాదాస్పదం కావడంతో వివరణ ఇస్తూ ఆయన మరో ట్వీట్ కూడా చేశారు. అంతేకాదు, అగ్ర‌నేత‌ల‌కు పిన్ చేయ‌డం వివాద‌స్ప‌దంగా మారింది. ఆ త‌రువాత దాన్ని తొలగిస్తూ మ‌రో ట్వీట్ చేయ‌డం జ‌రిగింది.

తెలంగాణ బీజేపీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట (Differences in BJP)

తొలి ట్వీట్ సారాంశాన్ని బీఆర్ఎస్ నేత‌ల వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తూ..‘‘కేసీఆర్ సోషల్ మీడియా ఊర కుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే.. బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊర కుక్కల్లార.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి” అని జితేందర్‌‌ రెడ్డి పేర్కొన్నారు. బిస్కెట్ల కోసం బరితెగించకండంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్‌పై విరుచుకుపడ్డారు. ఆ ట్వీట్ ను చూసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.(Differences in BJP) వ్యంగ్యంగా స్పందించారు.

బీజేపీ, బీఆర్ ఎస్ ఫిక్సింగ్ రాజ‌కీయ‌మ‌ని 

‘‘జితేందర్ రెడ్డి గారు.. బీజేపీ అంతర్గత ‘తన్నులాట’ను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారు అంటూ పీసీసీ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రాజ‌కీయ వ‌ర్గాల్లో జితేంద్ర‌రెడ్డి చేసిన‌ ట్వీట్ దుమారం రేపుతోంది. నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు, కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతున్న క్ర‌మంలో ఆయన పెట్టిన వీడియో చర్చనీయాంశమైంది. దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన.. ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్  (Differences in BJP)  ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ నాయ‌క‌త్వాన్ని

తెలంగాణ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లుగుతున్న‌ప్పుడు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ‌చ్చింది. దానిలో క‌విత అరెస్ట్ ఖాయ‌మంటూ ఆధారాల‌ను బీజేపీ ఢిల్లీ లీడ‌ర్ల నుంచి తెలంగాణ లీడ‌ర్ల వ‌ర‌కు ఊద‌ర‌గొట్టారు. కొన్ని వీడియోల‌ను కూడా బీజేపీ లీడ‌ర్లు విడుద‌ల చేశారు. ఎమ్మెల్యే క‌విత‌కు జైలు ఖాయ‌మంటూ విమ‌ర్శించారు. సీన్ క‌ట్ చేస్తే క‌వితను సీబీసీ, ఈడీ వ‌దిలేసింది. ఎలాంటి ఆధారాలు క‌విత ఉన్న‌ట్టు లేవ‌ని కోర్టు కూడా చెప్పేసింది. దానికి కార‌ణం బీజేపీ, బీఆర్ ఎస్ ఫిక్సింగ్ రాజ‌కీయ‌మ‌ని స‌గ‌టు తెలంగాణ పౌరుడు ఎవ‌ర్ని అడిగినా చెబుతారు. అందుకే, బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది.

సంజ‌య్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకించే వాళ్ల‌కు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల‌ని (Differences in BJP)

తెలంగాణ బీజేపీ ప‌రిస్థితిని చూసిన లీడ‌ర్లు ఆ పార్టీని వీడేందుకు ప్ర‌య‌త్నం.(Differences in BJP)  చేస్తున్నారు. మ‌రికొంద‌రు అసంతృప్తిగా ఉన్నారు. అగ్ర లీడ‌ర్లు బీజేపీ మీద న‌మ్మ‌కం పోయింద‌ని అంగీక‌రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు త‌ట‌స్థ లీడ‌ర్లు వెళ్లిపోతున్నారు. ఆ జాబితాలో పొంగులేటి, జూప‌ల్లి ఉన్నారు. బీజేపీ నుంచి వెళ్లే లీడ‌ర్ల‌లో ఈటెల‌, డీకే, విజ‌య‌శాంతి త‌దిత‌ర పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ నాయ‌క‌త్వాన్ని మార్చాల‌ని కొంద‌రు గ్రూప్ గా డిల్లీ వెళ్లారు. కానీ, బీజేపీ అధిష్టానం ఏ మాత్రం ఆలోచించ‌డంలేదు. ఈ ఎన్నిక‌లు బండి ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతాయ‌ని తేల్చేసింది.

Also Read : Telangana BJP: తెలంగాణ బీజేపీలో అధ్య‌క్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్ రెడ్డి.. సెటైర్లు వేసిన బండి సంజ‌య్‌

తెలంగాణ బీజేపీ కుమ్ములాట‌లు గురించి మీడియాలోనూ పెద్ద ఎత్తున న్యూస్ వ‌స్తోంది. ఆ గ్రూప్ విభేదాలు పోవాలంటే ఏమి చేయాలి? అనే అంశాన్ని తెలియ‌చేస్తూ జితేంద్ర‌రెడ్డి వివాద‌స్ప‌దం అయ్యేలా ట్వీట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకించే వాళ్ల‌కు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల‌ని తెలియ‌చేస్తూ దున్నుపోతును ఒక వ్య‌క్తి త‌న్ని వాహ‌నంలో ఎక్కించే వీడియో పెట్టారు. అలా బండి వ్య‌తిరేకుల‌ను త‌న్నాల‌ని సంకేతం ఇస్తూ ఆయ‌న ట్వీట్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీలు దాన్ని బేస్ చేసుకుని వ్యంగ్యాస్త్రాలు, విమ‌ర్శిల‌కు  (Differences in BJP)  దిగుతున్నారు.

 Also Read : Etela Vs Bandi: తెలంగాణ బీజేపీలో వర్గ పోరు.. ఈటెల టార్గెట్?